Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలు ఆశీర్వదిస్తే చరిత్ర సృష్టిస్తా : వైఎస్. జగన్మోహన్ రెడ్డి

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (10:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే తాను చరిత్ర సృష్టిస్తానని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తన తండ్రి వైఎస్ఆర్‌ను గుర్తుకు తెచ్చేలా పాలన సాగిస్తానని చెప్పారు. 
 
ఆయన తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. భవిష్యత్‌ కోసం ప్రజల ఆశా, ఆకాంక్షలే ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపిస్తాయన్నారు. ప్రజల సుఖసంతోషాలే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చుపెట్టి ఎన్నికల్లో నెగ్గుదాం అనుకుంటున్నా చంద్రబాబుని పన్నాగాన్ని ఏపీ ప్రజలు తప్పకుండా తిప్పికొడతారని జగన్ మోహన్ రెడ్డి విశ్వాసం వ్యక్తంచేశారు.
 
అసలు హైదరాబాద్‌నూ చంద్రబాబు నిర్మించనే లేదు ఇటు అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేయలేదని జగన్ విమర్శించారు. ఏ పార్టీతోనూ తమకు పొత్తుగానీ, సాన్నిహిత్యంగానీ లేదన్నారు. కానీ ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్దతిస్తామని తేల్చి చెప్పారు. 
 
ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు, జాతీయస్థాయి రాజకీయాలపై జగన్మోహన్ రెడ్డి తన అభిప్రాయాలను ఇలా వెల్లడించారు. నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నా. నేనిప్పుడు నా ప్రజలకు ఎంతమేర మంచి చేయాలన్న దాని గురించే ఆలోచిస్తున్నని ప్రస్తుతం కూడా అదే ఆలోచిస్తున్నామని చెప్పారు. ఏపీ ప్రజలు చంద్రబాబు నమ్మేపరిస్థితే లేదని ఆయన జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments