Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజీ హాస్టల్ విద్యార్థుల్లో 175 మందికి కరోనా

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (18:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిస్తోంది. ఫలితంగా కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక హాస్టల్‌లో ఉండే విద్యార్థుల్లో 175 మందికి కరోనా వైరస్ సోకింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ప్రైవేట్ జూనియర్ కాలేజ్‌కి చెందిన హాస్టల్‌లో ఈ పరిస్థితి ఏర్పడింది.
 
కాలేజ్ హాస్టల్‌లో మొత్తం 175 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కాలేజ్‌ హాస్టల్లోనే ప్రభుత్వ వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారు. వైద్య సేవలను మంత్రి చెల్లుబోయిన వేణు పరిశీలించారు. 
 
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్నారు. జాగ్రత్తలు పాటించకపోతే  మరోసారి లాక్‌డౌన్ ఎదుర్కోవలసి ఉంటుందని వేణు చెప్పారు. 
 
జిల్లాలో కొవిడ్‌ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. పాజిటివ్‌ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ మార్చి మూడోవారం నుంచి అడ్డుఅదుపూ లేకుండా పెరిగిపోతున్నాయి. కొవిడ్‌ అంతకంతకూ కోరలు చాస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతోన్న పాజిటివ్‌ల సంఖ్య రెట్టింపవుతోంది. 
 
దీంతో సర్వత్రా మళ్లీ ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీల్లో పాజిటివ్‌ల పరంపర కొనసాగుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ హైఅలర్ట్‌ ప్రకటించింది. మాస్క్‌ ఉంటేనే ఆయా పాఠశాలలు, స్కూళ్లు,  కాలేజీలోకి అనుమతించాలని విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments