Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్ ఫిల్మ్స్ చూసి చెడిపోయిన ఐదుగురు టీనేజర్స్... బాలికపై వరసగా అత్యాచారం

చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం చోటుచేసుకుంది. భగతసింగ్ కాలనీలో 11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు అయిదుగురు దుర్మార్గులు. చంటి, అరవింద్‌తో పాటు సైఫుల్లా, మన్సూర్, సైదులు గత కొద్ది రోజులుగా మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తున్నారు. నిన్న ర

Webdunia
గురువారం, 24 మే 2018 (21:53 IST)
చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం చోటుచేసుకుంది. భగతసింగ్ కాలనీలో 11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు అయిదుగురు దుర్మార్గులు. చంటి, అరవింద్‌తో పాటు సైఫుల్లా, మన్సూర్, సైదులు గత కొద్ది రోజులుగా మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తున్నారు. నిన్న రాత్రి స్థానికులు బాలికను మసీదు పెద్దల వద్దకు తీసుకెళ్లి పిర్యాదు చేశారు. ఆ తరువాత మసీదు పెద్దలతో కలిసి పిఎస్‌కు వెళ్లి  పోలీసులకు పిర్యాదు చేశారు.
 
ఐతే పోలీసులు పట్టించుకోలేదు. దీంతో భగత్ సింగ్ కాలనీకి వెళ్లి ఐదుగురు యువకులను పట్టుకొని చావబాదారు స్థానికులు. ఆ తరువాత ఘటనా స్థలానికి చేసుకున్నారు పోలీసులు. ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. పోలీసులు అదుపులో ఇద్దరు యువకులు ఉన్నారు. పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో యువకుడు చికిత్స పొందుతున్నాడు.
 
తొలుత ఐదుగురు యువకులు కలిసి బాలికను మాయచేసి లొంగదీసుకున్నారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. బాలిక విషయం తల్లికి తెలియచేయటంతో భర్త లేని ఆమె తమ్ముడు ద్వారా తమ ముస్లిం మసీదు కమిటీ ద్వారా పోలీసులకు పిర్యాదు చేశారు. నిందితులలో ఇద్దరికి రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఐతే పోలీసుల విచారణలో తేలిందేమిటంటే... నిందితులంతా పొద్దస్తమానం తమ సెల్ ఫోన్లలో పోర్న్ ఫిల్ములు చూస్తున్నారనీ, వాటికి ఎడిక్ట్ అయిన వీరు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం