Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త.. ఏంటది?

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (10:30 IST)
ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 7,218 గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు రంగం సిద్ధం చేసుకుంది. తాజా పోస్టులను జిల్లా యూనిట్‌గా భర్తీ చేయాలని ప్రభుత్వం సూచించింది.
 
ఈ నేపథ్యంలో వాలంటీర్ పోస్టుల భర్తీకి నెలలో రెండుసార్లు జాయింట్ కలెక్టర్లు నోటిఫికేషన్‌లు జారీ చేయనున్నారు. ఖాళీల వివరాలను ప్రతినెల 1, 16వ తేదీల్లో ఎంపీడీవోలు, పురపాలక శాఖ కమిషనర్‌లు కలెక్టర్లకు సమర్పించాల్సి ఉంటుంది. 
 
అలాగే సరైన కారణం లేకుండా విధులకు గైర్హాజరయ్యే వాలంటీర్లను తొలగిస్తారు. ఏడో రోజున వాలంటీర్ స్థానం ఖాళీ అయినట్లు అధికారులు నోటిఫై చేసి జాయింట్ కలెక్టర్‌కు నివేదిక అందించాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

పాతికేళ్ల స్వాతిముత్యం సారధ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులకు సాదర సత్కారం

Nagabushnam: నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

రానా దగ్గుబాటి నిర్మాణంలో రూపొందిస్తున్న కాంత లో సముద్రఖని లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments