Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో ప్రియురాలు ఏకాంతం.. పెన్ కెమెరాతో చిత్రీకరించి ఆ వీడియోను..

Webdunia
శనివారం, 4 మే 2019 (14:05 IST)
ఏపీలో ఈమధ్య కాలంలో క్రైం రేటు విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరిజిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన సంఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది.
 
అరుణ్, రమ్యలు ఇద్దరూ గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. రమ్య తల్లిదండ్రులతో గొడవపడి హాస్టల్లో ఉంటోంది. వీరిద్దరి మద్య ప్రేమ కాస్తా శారీరక సంబంధానికి దారితీసింది. సంవత్సరం రోజులుగా ఇది కొనసాగుతోంది. రమ్య హాస్టల్లో కరెంట్ పనులు చేసే రాజేష్ అనే యువకుడు వీరి వ్యవహారాన్ని గమనించాడు.
 
రెండు రోజుల క్రితం హాస్టల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. రిపేర్ చేయడానికి వచ్చిన రాజేష్ పెన్ కెమెరాను రమ్య గదిలో ఉంచాడు. దీంతో రమ్య, అరుణ్‌ల బాగోతం మొత్తం పెన్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ పెన్ కెమెరాలో రికార్డయిన వీడియో దృశ్యాలను చూపించి బెదిరించి రమ్య నుంచి డబ్బులు వసూలు చేయాలని చూశాడు. 
 
ఈ విషయాన్ని ప్రియుడు అరుణ్‌కు తెలిపిన రమ్య ఎలాగైనా రాజేష్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి రాజేష్‌ను తన గదికి రమ్మని డబ్బులిస్తానని నమ్మించారు. రాజేష్ గదిలోకి రాగానే పదునైన రాడ్‌తో రాజేష్ నెత్తిపై కొట్టి చంపేశారు. మృతదేహాన్ని స్థానికంగా ఉన్న పొలాల్లో పడేశారు. అయితే ఉదయాన్నే శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments