Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటికి పిలిచి కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి అత్యాచారం

విజయవాడ కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని టేనర్‌పేట అడ్డరోడ్డులో జరిగిన ఘటన సినిమా స్టోరీని తలపిస్తుంది. స్కూల్‌ గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడేందుకు పొట్నూరి లక్ష్మణ్‌ తన స్నేహితులతో కలిసి వచ్చేవాడు. గ్రౌండ్ సమీపంలో ఓ స్కూల్‌లో పనిచేస్తున్న 20 ఏళ్ల యువతి

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (13:53 IST)
విజయవాడ కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని టేనర్‌పేట అడ్డరోడ్డులో జరిగిన ఘటన సినిమా స్టోరీని తలపిస్తుంది. స్కూల్‌ గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడేందుకు పొట్నూరి లక్ష్మణ్‌ తన స్నేహితులతో కలిసి వచ్చేవాడు. గ్రౌండ్ సమీపంలో ఓ స్కూల్‌లో పనిచేస్తున్న 20 ఏళ్ల యువతి తన అన్నయ్యతో కలిసి ఉంటోంది. యువతి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించడంతో అన్నయ్యతో కలిసి ఉంటుంది. ఆమె అన్నయ్య మానసిక వికలాంగుడు. 
 
మానసిక పరిస్థితి సరిగా ఉండదు. దాంతో సదరు యువతిపై కన్నేసిన లక్ష్మణ్‌ పలుమార్లు మాటలు కలిపేందుకు ప్రయత్నించాడు. మంచివాడిగా నటించాడు. యువతి ఫోన్‌ నెంబర్‌ సంపాదించి ఫోన్‌ చేయడం, మెస్సేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. నమ్మకంగా ఉండటంతో లక్ష్మణ్‌తో యువతి మాట్లాడేది. ఒక రోజు ఆమెను తన ఇంటికి రావాలని, తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని చెప్పి నమ్మించాడు. 
 
బైక్‌పై ఇంటికి తీసుకు వెళ్లగా... ఇంట్లో అందరూ బయటకు వెళ్లారని చెప్పి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగించి ఆమెపై అత్యాచారం చేశాడు. అంతేకాదు అదంతా వీడియోలో బంధించాడు. అయితే రెండు నెలల కిందట యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో అప్పటి నుంచి లక్ష్మణ్‌ తప్పించుకుని తిరగడమే కాదు తన దగ్గిర వీడియోలు ఉన్నాయి.. అవన్నీ బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు.. దీంతో బాధితురాలు గురువారం కొత్తపేట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే నిందితుడి కోసం వెతకటం ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments