Webdunia - Bharat's app for daily news and videos

Install App

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌ను అమలు చేయం : మంత్రి ధర్మాన ప్రసాద రావు

వరుణ్
సోమవారం, 29 ఏప్రియల్ 2024 (14:07 IST)
వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రాష్ట్రంలో అమలు చేయమని రాష్ట్ రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాద రావు స్పష్టం చేశారు. న్యాయపరమైన క్లియరెన్స్ వచ్చాకే అమలుపై ఆలోచన చేస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే కొనసాగుతుందని ఆయన తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో, పూర్తి అక్యూరెసితో ఈ సర్వే జరుగుతుందని తెలిపారు. సీఎం జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ల్యాండ్ టైలింగ్ యాక్ట్‌ ఇపుడు ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. దీన్ని విపక్ష నేతలు ఒక ప్రచారాస్త్రంగా ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ యాక్ట్‌పై స్పందించారు. 
 
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని మిగతా రాష్ట్రాలు ఎలా అమలు చేస్తాయో ఆంధ్రప్రేశ్ రాష్ట్రంలో కూడా అదేవిధంగా అమలుచేస్తామని, అదికూడా న్యాయపరంగా క్లియరెన్స్ వచ్చాకే అమలు చేస్తామని వివరించారు. వందేళ్ల క్రితం రాష్ట్రంలో భూ సర్వే జరిగిందని, ఇప్పటి వరకూ మరే ప్రభుత్వం కూడా సర్వే చేపట్టలేదని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే భూ సంస్కరణలు అమలు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం నడుం బిగించిందని తెలిపారు. రాష్ట్రంలో 17 వేల రెవెన్యూ గ్రామలు ఉండగా.. అందులో 4 వేల రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటికే సర్వే పూర్తయిందని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments