Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో భర్త... పక్కింట్లో ప్రియుడు.. సంవత్సరం పాటు భార్య అలా..?

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (22:14 IST)
ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకోకపోతే వారిని మర్చిపోవడం చాలా కష్టతరమవుతుంది. ఇది చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. ఒకవేళ అలా కాకుండా పెళ్ళి చేసుకున్న వ్యక్తి ఆప్యాయంగా చూసుకుంటే ఇక ప్రేమించిన వారిని మర్చిపోయిన వారు ఉన్నారు. కానీ ఒక మహిళ మాత్రం అటు ప్రేమించిన వ్యక్తిని వదిలి ఉండలేక, కట్టుకున్న భర్తను కాదనలేక నలిగిపోయింది. 
 
చిత్తూరు జిల్లా పాపానాయుడుపేటలో ఉన్న ఒక గ్రామం. (పేర్లు మార్చాం) అక్కడ నివాసముంటున్న హేమమాలినికి సంవత్సరం క్రితం పాండురంగ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. హేమమాలిని డిగ్రీ వరకు చదువుకుంది. విద్యనభ్యసించే సమయంలో శ్రీనివాస్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. రెండు సంవత్సరాల పాటు ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. 
 
హేమమాలిని వ్యవహారం ఇంట్లో తెలిసినా సరే వారు పెద్దగా పట్టించుకోలేదు. డిగ్రీ పూర్తయిన తరువాత ఇద్దరూ పెళ్ళి చేసుకుందామని అనుకున్నారు. కానీ శ్రీనివాస్‌కు యాక్సిడెంట్ అయ్యింది. మోటారు సైకిల్ పైన వెళుతూ కిందపడిపోయాడు. కుడి కాలు ఎముక విరిగి మంచాన పడిపోయాడు. తనకు జరిగిన ప్రమాదంపై ప్రియురాలికి చెప్పలేదు.
 
కాలు విరిగిపోయిన తాను పెళ్ళి చేసుకుని ఎలా పోషించగలనని అనుకున్నాడు. దీంతో ఆమెతో రెండు నెలల పాటు మాట్లాడటం మానేశాడు. హేమమాలిని ఇంటికి దగ్గరే ఉన్నా సరే ఆమెకు కనిపించకుండా ఉన్నాడు. తనను శ్రీనివాస్ ప్రేమించలేదనుకున్న హేమ ఇంట్లో చెప్పిన పెద్దల పెళ్ళిని చేసేసుకుంది. పెళ్ళయిన కొన్ని రోజులకే శ్రీనివాస్‌కు జరిగిన ప్రమాదం గురించి తెలిసింది. అయితే వివాహం చేసుకున్న పాండురంగ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుండడంతో హేమమాలిని ఆలోచనలో పడిపోయింది. శ్రీనివాస్ ఆరోగ్యం కుదుట పడింది. ఇప్పుడు ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్‌ ఉద్యోగిగా చేస్తున్నాడు. హేమమాలిని ఇంటి ముందు నుంచే విధుల్లోకి వెళుతుంటాడు శ్రీనివాస్.
 
పక్కన ప్రేమించిన ప్రియుడు, ఇంట్లో ప్రేమగా చూసుకునే భర్త ఏం చేయాలో పాలుపోక ఒక వివాహిత ఆలోచనలో పడిపోయింది. ఫేస్ బుక్ అకౌంట్‌లో తన ఆవేదనను పెట్టింది. అయితే శ్రీనివాస్ మాత్రం తనతో ఇప్పటికీ మాట్లాడటం లేదని కూడా చెబుతోంది. సలహా అడుగుతోంది హేమమాలిని. ఆ సలహాలు ఎవరికి తోచిన విధంగా వారు పోస్ట్ చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jwala Gutta: మా నాలుగో వార్షిక సంవత్సరం.. జ్వాలా గుత్తాకు ఆడబిడ్డ.. విష్ణు విశాల్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబు కు ఈడీ నోటీసులు వల్ల ప్రయోజనం ఏమిటి?

మహేష్ బాబుకు షాక్- ఈడీ నోటీసులు జారీ.. 27న విచారణకు హాజరు

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments