Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళయిన వివాహితకు లవ్ ప్రపోజ్ చేసిన యువకుడు.. ఆ తరువాత?

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (15:34 IST)
వివాహమైన రెండు నెలలకే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది. ఒక యువకుడు ప్రేమ పేరుతో వివాహితను వేధించడంతో ఆమె మనస్థాపంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. మదనపల్లె గ్రామీణ మండలం కొత్తపల్లె పంచాయతీకి చెందిన రమ్య అనే యువతికి రెండునెలల క్రితం సమీప బంధువుతో వివాహమైంది. 
 
వివాహమైన తరువాత రెండు నెలల వరకు వీరి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా బాగానే సాగింది. అయితే ఆ వివాహిత ఉన్న ఇంటి పక్కనే మంజునాథ్ అనే యువకుడు ఉండేవాడు. అతను వివాహిత సెల్ నెంబర్‌ను తీసుకుని ఫోన్‌లో లవ్ ప్రపోజ్ చేశాడు. పక్కింటి కుర్రాడే కదా తెలుసుకుంటాడులే అని ఊరుకుంది వివాహిత.
 
అయితే ఇంటి దగ్గరకు వచ్చి లవ్ ప్రపోజ్ చేయడం.. నువ్వు లేకుంటే చచ్చిపోతానంటూ బెదిరించడం.. ఇలా చేయడంతో విషయం కాస్త వివాహిత భర్త, అత్తమామల దృష్టికి వెళ్ళింది. ఇందులో రమ్య తప్పుందని భావించిన అత్తమామలు ఆమెను గత మూడురోజుల నుంచి హింసించడం మొదలుపెట్టారు. దీంతో మానసిక క్షోభకు గురైన వివాహిత తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు గల కారణాలను లేఖలో రాసింది రమ్య. దీంతో పోలీసులు యువకుడితో పాటు వివాహిత అత్త, మామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments