Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వేడెక్కిన రాజకీయ వాతావరణం ... టీడీపీ కూటమిదే గెలుపు

ఠాగూర్
శుక్రవారం, 15 మార్చి 2024 (09:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ, జనసేన కూటమిలోకి జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ చేరడంతో ఆ కూటమికి మరింత బలం పెరిగింది. అదేసమయంలో అధికార వైకాపాలో గుబులు మొదలైంది. అభ్యర్థుల ఎంపికలో మల్లగుల్లాలు పడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి... ఈ పొత్తు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ఇప్పటికే 12 విడతలుగా అభ్యర్థులను ప్రకటిస్తున్నప్పటికీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదని పరిస్థితిలో ఉంది. 
 
మరోవైపు, టీడీపీ జనసేన బీజేపీ కూటమి మాత్రం సీట్ల సర్దబాటు పూర్తి చేసుకుని అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమైంది. టీడీపీ ఇప్పటికే రెండు విడుదల్లో 120 మందికిపైగా అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇంకోవైపు, పిఠాపురం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రకటించారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గాను టీడీపీ 144, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి 31 చోట్ల పోటీ చేస్తున్నాయి. అలాగే, 25 ఎంపీ సీట్లలో బీజేపీ 6, జనసేన 2, టీడీపీ 17 స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యాయి. 
 
ఈ పరిస్థితుల్లో తాజాగా ఏబీపీ అనే సంస్థ కోసం సీ-ఓటర్ అనే సంస్థ ఓ సర్వేను నిర్వహించి, ఫలితాలను వెల్లడించింది. దేశ వ్యాప్తంగా చేపట్టిన ఈ సర్వే ఫలితాల్లో ఏపీలోని 25 లోక్‌సభ సీట్లలో టీడీపీ కూటమి 20 స్థానాల్లో గెలుచుకుంటుందని తెలిపింది. అధికార వైకాపా కేవవం 5 స్థానాలకే పరిమితం కావొచ్చని పేర్కొంది. కాగా, ఇప్పటివరు వెల్లడించిన సర్వే ఫలితాలన్నీ టీడీపీ కూటమివైపే మొగ్గు చూపాయి. ఫిబ్రవరి చివర, మార్చి మొదటి వారంలో ఈ సర్వే నిర్వహించినట్టు తెలుస్తుంది. అలాగే, మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణాలో అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లను గెలుచుకోవచ్చని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments