Webdunia - Bharat's app for daily news and videos

Install App

వక్ఫ్ బోర్డు ద్వారా దర్గాలు పీర్ల పంజాల‌కు న్యాయం చేయండి

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (12:59 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వ్యవహారంలో సరైన నిర్ణయం తీసుకొని దర్గాలు పీర్ల పంజాలు, పీర్లకు  న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కు రాష్ట్ర అహలె సున్నత్ జమాత్ కో కన్వీనర్ అల్తాఫ్ రజా విజ్ఞప్తి చేశారు. విజయవాడలో ఆయ‌న ఉప‌ముఖ్య మంత్రిని కలిసి వక్ఫ్ బోర్డు సమస్యలపై సున్ని, షీయ జమాత్ లకు న్యాయం చేయాలని కోరారు.


దర్గాలపై నమ్మకం లేనివారికి బాధ్యత ఇవ్వటం వల్ల న్యాయం జరగదని, దర్గాలకు, పీర్ల పంజాలకు సంబంధించిన సున్ని జమాత్ ల  మాషాయక్, ముత్తవల్లిలా అభిప్రాయం తీసుకోవాలన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రితో తమ సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. వేల ఎకరాల వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉండి కూడా వాటికి సంబంధించిన దర్గాలు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ హక్కులు కాపాడేందుకు, ముఖ్యమంత్రికి తమ గోడు చెప్పుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు.
 
 
అల్తాఫ్ రజా విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి  ముఖ్యమంత్రితో చర్చించి పూర్తి న్యాయం చేస్తానని, తప్పకుండా తమ సమస్యలను చెప్పుకునేందుకు ముఖ్యమంత్రితో సమావేశం అవుదామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దర్గాలు, పీర్ల పంజాల సమస్యలపై నేరుగా వాటిని సందర్శించి పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తుమ‌న్నారు. ముఖ్యంగా గుంటూరు కాకాని బాజీ బాబా దర్గా, కొండపల్లి గాలిబ్ షహీద్ బాబా దర్గా షాబుఖారి బాబా దర్గాలో ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments