Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశవాణి చిన్నమ్మ ఇకలేరు...

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (09:47 IST)
ఆకాశవాణి చిన్నమ్మ ఇకలేరు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రతి రోజూ ప్రసారమయ్యే 'పాడి-పంట' కార్యక్రమంలో చిన్నమ్మగా శ్రోతలను పలుకరించిన నిర్మలా వసంత్ అనారోగ్యం కారణంగా చనిపోయారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. 
 
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె... ఈ నెల 8వ తేదీన ఆకాశవాణి కేంద్రంలో జరిగిన పూర్వఉద్యోగుల ఆత్మీయసమ్మేళనంలో చివరిసారిగా పాల్గొన్నారు. తమిళనాడుకు చెందిన ఆమె కుటుంబం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కడప జిల్లాలో స్థిరపడ్డారు. 
 
హైదరాబాద్‌కు చెందిన వసంత్‌తో వివాహం జరిగిన అనంతరం ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. నిర్మల భర్త నిజాం కాలేజీలో ఇంగ్లీషు విభాగంలో పని చేశారు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. పల్లెటూరి అమాయక మహిళా రైతుల సందేహాలను తన గొంతులో వినిపిస్తూ, పెద్దయ్య ద్వారా సమాధానాలు రాబడుతూ అందరినీ మెప్పించారు. వ్యవసాయ విభాగానికి కొండంత అండగా చిన్నమ్మ తన సేవలు అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments