Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తగా పెళ్లైంది.. భర్తతో విభేదాలు.. వేరొకరితో సహజీవనం.. అనుమానస్పద మృతి.. ఎలా?

కొత్తగా పెళ్లైంది. రెండు నెలలు కూడా గడవలేదు. భర్తతో కలిసి 15 రోజులే కాపురం చేసింది. అయితే భర్త వేధింపులు తాళలేక.. ఇంటి నుంచి వెళ్ళిపోయింది. వేరొకరితో సహజీవనం చేసింది. కానీ అనుమానస్పద స్థితిలో మృతి చెం

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (11:13 IST)
కొత్తగా పెళ్లైంది. రెండు నెలలు కూడా గడవలేదు. భర్తతో కలిసి 15 రోజులే కాపురం చేసింది. అయితే భర్త వేధింపులు తాళలేక.. ఇంటి నుంచి వెళ్ళిపోయింది. వేరొకరితో సహజీవనం చేసింది. కానీ అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి మెడపై ఉరితీసిన గుర్తులుండడంతో ఆమెది హత్యా.. ఆత్మహత్యా.. అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర రాజధాని అమరావతికి సమీపంలో ధర్మకోట గ్రామానికి చెందిన మల్లాడి రాంబాబు, నాగలక్ష్మి దంపతుల కుమార్తె కృష్ణవేణి(20)ని ఫ్రెంచి యానాంకు చెందిన సంగాని సత్యనారాయణకు 2016 డిసెంబరు 1న వివాహం చేశారు. వీరిద్దరూ 15 రోజుల పాటే కాపురం చేశారు. వీరిద్దరి మధ్య ఏర్పడిన విభేదాలు వేధింపులకు దారితీసింది. భర్త వేధింపులు తాళలేక కృష్ణవేణి అమలాపురానికి చేరుకుంది. 
 
స్థానికంగా తాపీ పనిచేస్తున్న చుట్టుగుళ్ల నానితో కృష్ణవేణికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కామనగరువు శివారు అబ్బి రెడ్డివారికాలనీలో భార్యాభర్తలమని చెప్పి ఓ ఇంట్లో అద్దెకు దిగారు. తాపీపని చేసుకునే నాని రెండ్రోజులకొకసారి వస్తానని ఇంటివారిని నమ్మించి కృష్ణవేణిని చూసుకోమని చెప్తుండేవాడు. కృష్ణవేణి స్థానిక ముస్లింవీధిలోని గణేష్‌ కిరాణామర్చంట్స్‌లో పనిచేసేది. 
 
ఈ నేపథ్యంలో ఈనెల 29 ఉదయం ఇంట్లో కృష్ణవేణి స్పృహలేకుండా పడి ఉండడాన్ని ఇంటి యజమాని గుర్తించారు. కృష్ణవేణిని పరిశీలించిన వైద్యులు ఆమె మెడపై ఉరి వేసినట్టు గుర్తులు ఉన్నట్టు నిర్ధారించారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా.. లేక హత్యచేశారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments