Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు అవమానిస్తున్నారు.. తిట్టిన నోటితో పొగిడి.. జగన్‌ చెంతకెళ్తా... ఆనం వేవికా

నెల్లూరు సోగ్గాడుగా పేరొందిన ఆనం వివేకానంద రెడ్డి పార్టీ మారనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు.. ఆయన అనుచరులు నిత్యం అవమానిస్తున్నారంటూ ఆయన మండిపడుతున్నారు. అందుకే టీడీపీని వీడాలని భావిస్

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (11:42 IST)
నెల్లూరు సోగ్గాడుగా పేరొందిన ఆనం వివేకానంద రెడ్డి పార్టీ మారనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు.. ఆయన అనుచరులు నిత్యం అవమానిస్తున్నారంటూ ఆయన మండిపడుతున్నారు. అందుకే టీడీపీని వీడాలని భావిస్తున్నారు. ముఖ్యంగా.. అడుగడుగునా అవమానించడమే కాకుండా, ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చలేదన్న కోపంతో ఆయన రగిలిపోతున్నారు. 
 
పైగా, గత 15 నెలలుగా టీడీపీలో కొనసాగతున్నప్పటికీ.. అది కలతల కాపురంగానే కొనసాగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. అదేసమయంలో వైకాపా చెంతకు చేరాలని భావిస్తున్నారు. తిట్టిన నోటితోనే జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించాలని వివేకా కోరుతున్నారు. 
 
నిజానికి ఆనం సోదరులు కాంగ్రెస్‌లో 20 ఏళ్ల పాటు ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. 2016 జనవరి 17న విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సీఎం సమక్షంలో ఆనం బ్రదర్స్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్‌చార్జి బాధ్యతలు, వివేకాకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.
 
చెప్పినట్లుగానే ఆరు నెలల తరువాత ఆత్మకూరు ఇన్‌చార్జి బాధ్యతలు రామనారాయణరెడ్డికి అప్పగించారు. కాని వివేకాకు ఇస్తామన్న ఎమ్మెల్సీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. గత ఏడాది డిసెంబర్‌లో ఇదే విషయాన్ని సీఎంతో చర్చించి ఎమ్మెల్సీ అవకాశం ఇప్పించాలని ప్రయత్నాలు చేశారు. 
 
ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి తనకు ఎమ్మెల్సీ అవకాశం తనకు ఇస్తే రాష్ట్ర కేబినెట్‌లో స్థానం దక్కుతుందని ఇందుకు సోదరుడు వివేకా సహకరించాలని కోరారు. ఈ విషయంలో ఆనం సోదరుల మధ్య కొంత వివాదం నడిచినట్లు ప్రచారం సాగింది. తాజా రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ఆనం సోదరులకు ఎమ్మెల్సీ అవకాశం దాదాపు లేనట్లుగానే ప్రచారం సాగుతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments