Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈఎస్ఐ స్కామ్ : అచ్చెన్నాయుడికి బెయిల్

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (14:21 IST)
తెలుగు రాష్ట్రాలను ఓ కుదుపుకుదిపిన ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టు అయిన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె.అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరైంది. ఈ మేరకు ఏపీ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. 
 
ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టు అయిన అచ్చెన్నాయుడికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన ప్రస్తుతం మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని గతంలో కోర్టుకు దరఖాస్తు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. 
 
మరోసారి బెయిల్ మంజూరు చేయాలని అచ్చెన్న తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థి లోద్ర, హైకోర్టు సీనియర్ న్యాయవాది వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. 
 
ఈ వాదనలు మూడు రోజుల క్రితమే పూర్తయ్యాయి. కానీ తీర్పును రిజర్వులో ఉంచి శుక్రవారం వెలువరించింది. కొద్ది సేపటి క్రితమే హైకోర్టు అచ్చెన్నాయుడుకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 
 
రూ.2 లక్షలు షూరిటీ ఇవ్వాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లవద్దని, సాక్షులను తారుమారు చేయవద్దని, దర్యాప్తు అధికారికి అందుబాటులో ఉండాలని హైకోర్టు విధించిన షరతుల్లో పేర్కొంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments