Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాశారా? జగన్ ప్రశ్న

Webdunia
గురువారం, 11 జులై 2019 (10:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా గురువారం కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఎలా వెళ్లారంటూ ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ప్రశ్నించారు.
 
దీనికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనదైనశైలిలో స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తానుక వెళ్లినా వెళ్ళక పోయినా స్విచాన్ చేసేవారన్నారు. అసలు ఈ ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడే కట్టారనీ, అపుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గాడిదలు కాశారంటూ ప్రశ్నించారు. దీనికి టీడీపీ సభ్యులు అడ్డుతగిలే ప్రయత్నం చేసినా స్పీకర్ వారికి మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదు 
 
ఆ తర్వాత జగన్ మాట్లాడుతూ, ఐదేళ్ల చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారనీ, ఆ సమయంలో చంద్రబాబు ఏం చేశారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడే ఆల్మట్టి కట్టారనీ, చంద్రబాబు సీఎంగా ఉన్నపుడే ఆల్మట్టి ఎత్తు పెంచారని, ఇపుడు కాళేశ్వరం కట్టారనీ గుర్తుచేశారు. ముఖ్యంగా, కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఉండగా, చంద్రబాబు మనకళ్ల ముందే చక్రం తిప్పుతున్నపుడే ఆల్మట్టి ఎత్తు పెంచారని జగన్ గుర్తుచేశారు.
 
ఏపీ పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ ఔదార్యం చూపుతున్నారన్నారు. అలాంటి వ్యక్తిని స్వాగతించడం పోయి.. విమర్శించడం తగదన్నారు. పైగా, రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలన్నారు. అపుడే ఇరు రాష్ట్రాలు అభివృద్ధిపథంలో పయనిస్తాయన్నారు. తెలంగాణతో స్నేహభావంతో మెలగడం తప్పా అంటూ జగన్ నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments