ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త మంత్రి మండలి జాబితాకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిందన్ ఆమోదముద్ర వేశారు. దీంతో కొత్త మంత్రులు సోమవారం మధ్యాహ్నం 11.31 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
కాగా, కొత్త మంత్రివర్గాన్ని సీఎం జగన్‌తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కోర్ కమిటీ తీవ్ర కసరత్తుల అనంతరం 25 మందితో కూడిన నూత మంత్రివర్గాన్ని రూపకల్పన చేశారు. వీరిలో 11 మంది పాతవారికి, 14 మందికి కొత్తవారికి అవకాశం కల్పించారు. కొత్తగా మంత్రులుగ దక్కించుకున్న వారిలో రోజా, అంబటి రాంబాబు, విడదల రజనీ, ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్ తదితరులు ఉన్నారు.