Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యాటక అవార్డులు, రివార్డులు ఆంధ్రప్రదేశ్‌కు సొంతం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అవార్డుల పరంపర కొనసాగుతోంది. పర్యాటక అనుకూల విధానాలతో నిత్యనూతనంగా జాతీయ అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను ఆకర్షించటంలో ముందున్న రాష్ట్ర పర్యాటక శాఖకు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక ఎడ్వంచర్ టూర్ ఆపరేటర్స

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (20:08 IST)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అవార్డుల పరంపర కొనసాగుతోంది. పర్యాటక అనుకూల విధానాలతో నిత్యనూతనంగా జాతీయ అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను ఆకర్షించటంలో ముందున్న రాష్ట్ర పర్యాటక శాఖకు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక ఎడ్వంచర్ టూర్ ఆపరేటర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌ను ఉత్తమ సాహస పర్యాటక భారతీయ రాష్ట్రంగా ప్రకటించింది. సాహస క్రీడలు, సాహసోపేతమైన ప్రయాణం వంటి రంగాలను ప్రోత్సహిస్తున్నందుకుగాను రాష్ట్రానికి ఈ అవార్డు లభించిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వివరించారు. 
 
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సగటున ప్రతినెలా ఒక అవార్డును పర్యాటక శాఖ దక్కించుకుంటోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయిడు నుండి లభిస్తున్న ప్రోత్సాహంతో తమ అధికారులు, సిబ్బంది చేస్తున్న నూతన ఆవిష్కరణల ఫలితంగానే ఇది సాధించగలిగామన్నారు. ఈ నెల 19వ తేదీన కేరళ వేదికగా జరిగే అవార్డుల ప్రధానోత్సవంలో ఎపిటిడిసి ఎండి హిమాన్హు శుక్లా ఈ పురస్కారాన్ని అందుకుంటారని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.
 
మరోవైపు ఈవెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన అవార్డులలో రెండింటిని ఆంధ్రప్రదేశ్ టూరిజం సొంతం చేసుకుందన్నారు. ప్రభుత్వపరమైన ఈవెంట్లకు సంబంధించిన విభాగంలో 48 ఎంట్రీలు రాగా తొలి 2 స్థానాల కోసం మనకై మనమే పోటీపడినట్లు అయ్యిందన్నారు. గోల్డెన్ ఈవెంట్‌గా 2017 ఫిబ్రవరిలో నిర్వహించిన విశాఖ పెస్టివల్, సిల్వర్ ఈవెంట్‌గా అమరావతి మ్యూజిక్ ఫెస్టివల్ రికార్డులకు ఎక్కాయి. ఇది సాధారణ విషయం కాదని ఒడిదుడుకులను ఎదుర్కుంటున్న ఒక నూతన రాష్ట్రం జాతీయస్థాయిలో వరుసగా తొలి 2 స్ధానాలను దక్కించుకోవటం ప్రభుత్వ సత్తాను వెల్లడిస్తుందన్నారు.
 
ఇదిలావుండగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ భువనేశ్వర్ వేదికగా నిర్వహించిన 33వ వార్షిక సదస్సులో ఎపి టూరిజం ఏర్పాటు చేసిన స్టాల్ ఉత్తమమైనదిగా ఎంపికైంది. ఎపిటిడిసి ఎండి హిమాన్హు శుక్లా స్వయంగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ చేపడుతున్న కార్యక్రమాలను జాతీయ స్థాయిలో ప్రాచుర్యం, ప్రచారం పొందేందుకు విశేష కృషి చేసారని ఈ నేపధ్యంలో మీనా తెలిపారు. 
 
ఈ క్రమంలోనే 2018లో ఈ సదస్సును నిర్వహించే అరుదైన అవకాశం ఆంధ్రప్రదేశ్‌కు లభించిందని, దీనికి సంబంధించిన అధికార దండాన్ని ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నుండి శుక్లా అందుకున్నారని ముఖేష్ తెలిపారు. పర్యాటకుల రాక పరంగా కూడా గణనీయమైన పురోగతిని సాధించామని రానున్న రోజుల్లో మరిన్ని వినూత్న కార్యక్రమాలను పర్యాటకులు చూడబోతున్నారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments