Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపలో ఆ పని చేయకుండా కేంద్రం మోసం చేస్తుంది... ఏపీ మంత్రి మండలి ఆగ్రహం

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (19:00 IST)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలు విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రెండు లేఖలు, తిత్లీ తుఫాను సాయంపై కేంద్ర హోం మంత్రికి మరో లేఖ రాయాలని మంత్రి మండలి సమావేశం నిర్ణయించింది. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంలో కేంద్రం జాప్యం చేస్తుందనడంకంటే మోసం చేస్తుందని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పీఎంకు  3 లేఖలు రాయాలని మంత్రి మండలి నిర్ణయించినట్లు తెలిపారు. విభజన ఒప్పందంలో భాగంగా కడపలో స్టీలు ప్లాంటు ఏర్పాటు చేయాల్సి ఉందని, కానీ ఆ దిశగా  కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి మొదటి లేఖ  రాయాలని  తీర్మానించినట్లు చెప్పారు. 
 
కేంద్ర హామీలు అమలు కావడం లేదని, తక్షణం వాటిని అన్నింటినీ అమలు చేయాలని రెండవ లేఖ రాయాలని నిర్ణయించామన్నారు. విభజన చట్టంలోని ఏ హామీ సంపూర్ణంగా నెరవేర్చడం లేదని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని, వెనకబడిన జిల్లాలకు నిధులు నిలిపేశారని, ఏపీపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని,  పోలవరం డీపీఆర్ ఆమోదించలేదని, తిత్లీ తుఫానుకు పైసా కూడా ఇవ్వలేదని, ఇప్పటికైనా కేంద్రం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసినట్లు వివరించారు. కేంద్రం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేదన్నారు. ఈ అంశాలపై లేఖ రాస్తారని చెప్పారు. తిత్లీ తుఫాన్ విషయంలో కేంద్ర వైఖరిపై కేంద్ర హోం మంత్రికి ప్రత్యేకంగా మరో లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
 
కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో కడప ఉక్కు కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే వంద శాతం పెట్టుబడి వ్యయాన్ని భరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ‘రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్’ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదించిందని చెప్పారు. వచ్చే నెలలో దీనికి పునాదిరాయి వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టరుగా గతంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సీఎండీగా పని చేసిన పి.మధుసూధన్‌ను నియమించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అవసరమైతే ఈక్విటీకి వెళ్లాలని, ముందుకొచ్చే ప్రైవేటు సంస్థలతో జాయింట్ వెంచర్‌గా ముందుకెళ్లాలని సమావేశం భావించినట్లు తెలిపారు. 
 
కడప స్టీల్ ప్లాంట్ ప్రజల చిరకాల వాంఛ అని, ఆ ప్రాంతంలో యువతకు ఉద్యోగాలు పెద్దఎత్తున రావాలని మంత్రి మండలి అభిప్రాయపడిందన్నారు. విభజన ఒప్పందంలో కడపలో నెలకొల్పాల్సిన ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం వివక్షతో నిరాకరించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుందన్నారు.  స్వయంగా ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని నిశ్చయించినట్లు చెప్పారు. ‘రాయలసీమ స్టీల్ కార్పొరేషన్’కు ప్రాథమిక పెట్టుబడిగా రూ. 2 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.  మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 12 వేల కోట్లుగా అంచనా వేశారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments