Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు కేసీఆర్‌‍ను బూతులు తిట్టి... నేడు అదే తప్పు చేసిన చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అని తేలిపోయింది. నలుగురికి నీతులు చెప్పే చంద్రబాబు.. చివరకు ఆ నీతికి, నైతిక విలువలకు కట్టుబడేందుకు ప్రయత్నం చేయడం లేదు.

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (12:29 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అని తేలిపోయింది. నలుగురికి నీతులు చెప్పే చంద్రబాబు.. చివరకు ఆ నీతికి, నైతిక విలువలకు కట్టుబడేందుకు ప్రయత్నం చేయడం లేదు. ముఖ్యంగా రాజకీయాల్లోనే కాడుండా వ్యక్తిగతంగా కూడా విలువలు పాటించే విషయంలో తాను ఎప్పుడూ ముందుంటానని, ఈ విషయంలో ఎవరినైనా ప్రశ్నిస్తానని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తాజాగా ఆ విలువలకు తిలోదకాలిచ్చారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మంత్రివర్గంలోకి టీడీపీ నుంచి తెరాసలోకి వెళ్లిన సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను తీసుకున్నారు. దీన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ఇదే అంశంపై టీ టీడీపీ న్యాయపోరాటం కూడా చేస్తోంది. ఇపుడు ఇదే తప్పు చంద్రబాబు చేశారు. వైకాపా నుంచి టీడీపీలో చేరిన వారిలో నలుగురు జంప్ జిలానీలకు మంత్రి పదవులు కట్టబెట్టారు. 
 
తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయంలో అప్పట్లో గవర్నర్‌పైనా చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు, పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. పార్టీలో సమర్థులే లేరా, ఫిరాయింపు ఎమ్మెల్యేలే దొరికారా? అప్పుడు విమర్శించిన వారికి ఇప్పుడు పదవులా అని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments