Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి కృష్ణవేణి మృతి బాధాకరం : సీఎం చంద్రబాబు

ఠాగూర్
ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (13:31 IST)
ప్రముఖ సినీ నిర్మాత, నటి కృష్ణవేణి మృతి బాధాకరమని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతిపై ఆయన ఆదివారం విచారం వ్యక్తం చేశారు. స్టూడియో అధినేతగా, పలు ఉత్తమ చిత్రాలను నిర్మించిన కృష్ణవేణి తెలుగు సినీ కీర్తిని చాటారని చెప్పారు. రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారని గుర్తు చేశారు. కృష్ణవేణి ఆత్మకు శాంతి చేకూరలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
 
అలనాటి నటి కృష్ణేవేణి ఇకలేరు... 
 
అలనాటి సినీ నటి కృష్ణవేణి ఇకలేరు. ఆమె వయసు 102 సంపత్సరాలు. వయసు రీత్యా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె ఆదివారం ఉదయం ఫిల్మ్ నగరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణవేణి మరణవార్త తెలుసుకుని పలువురు ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.
 
ఏపీలోని రాజమండ్రికి చెందిన కృష్ణవేణి సినిమాలలో అడుగుపెట్టకముందు రంగస్థల నటిగా ఉన్నారు. 1936లో సతీ అనసూయ చిత్రంతో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత కథానాయికగా తెలుగులో 15కు పైగా చిత్రాల్లో నటించారు. కొన్ని తమిళ, కన్నడ, భాషా చిత్రాల్లో కూడా హీరోయిన్‌గా నటించారు. 
 
1949లో తెలుగులో చిత్రపరిశ్రమలో ఓ మైలురాయిగా నిలిచిపోయి మనదేశం వంటి చిత్రాన్ని నిర్మించి, అందులో తెలుగు తెరకు దివంగత నటుడు, సీనియర్ ఎన్టీఆర్‌ను, ఎస్వీ రంగారావును, సినీ నేపథ్యం గాయకుడు ఘంటసా వేంకటేశ్వర రావును వెండితెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత అనేక సినిమాలలో గాయకులు, నటీనటులు, సంగీత దర్శకులను పరిచయం చేశారు. 
 
ఇక కృష్ణవేణి నటించిన సినిమాలోల సతీ అనసూయ, మోహినీ రుక్మాంగద, కచదేవయాని, మళ్లీ పెళ్లి, మహానంద, జీవనజ్యోతి, దక్షయజ్ఞం, భీష్ణ, బ్రహ్మారథం, మదాలస, మనదేశం, గొల్లభామ, లక్ష్మమ్మ వంటి చిత్రాలు మంచి గుర్తింపుతో పాటు పేరును సంపాదించిపెట్టాయి. చిత్రపరిశ్రమకు ఆమె చేసిన సేవలకుగాను తెలుగు చిత్రపరిశ్రమలో 2004లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments