Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సైట్ ఓపెన్ చేస్తే చంద్రబాబు కనిపిస్తాడు.. ఏ సైట్...!

విశ్వవిద్యాలయాలను కూడా పార్టీ కార్యాలయాల్లాగా మారుతున్నాయా అనే విమర్శలు వస్తున్నాయి. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో టిడిపి కొంత ఓవరాక్షన్ చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ యూనివర్సిటీ వెబ్‌సైట్ పైన అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గూగుల్

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (14:33 IST)
విశ్వవిద్యాలయాలను కూడా పార్టీ కార్యాలయాల్లాగా మారుతున్నాయా అనే విమర్శలు వస్తున్నాయి. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో టిడిపి కొంత ఓవరాక్షన్ చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ యూనివర్సిటీ వెబ్‌సైట్ పైన అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గూగుల్‌లో ఎస్వీయు అని ఎవరైనా సెర్చ్ చేయడం మొదలుపెడితే ముందుగా చంద్రబాబు పార్టీ పాంప్లేట్ రూపంలో వెబ్ పేజ్ ఓపెన్ అవుతోంది. దీంతో తాము ఓపెన్ చేసింది ఒక యూనివర్సిటీ వెబ్ పేజీనా, లేకుంటే టిడిపికి చెందిన వెబ్ పేజీనా అనే ఆశ్చర్యానికి లోనవుతున్నారు విద్యార్థులు. 
 
కోర్సుల కోసం యూనివర్సిటీల్లో ఉన్న సౌకర్యాలను తెలుసుకోవడం కోసం వెబ్ సైట్‌ను ఎక్కువగా విద్యార్థులు ఓపెన్ చేస్తూ ఉంటారు. యూనివర్సిటీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందరూ తెలుసుకునే విధంగా అందుబాటులో ఉంచడమే ఈ వెబ్ సైట్ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ అసలు ఉద్దేశం పక్కకు వెళ్ళి అనవసర ప్రచారం ముందుకు వస్తోంది. యూనివర్సిటీ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే అంతా పచ్చగా కనిపిస్తుంది. దీంతో తరువాత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలు ఎలా తెలుసుకోవాలో తెలియక తాము తప్పు వెబ్ సైట్‌ను ఓపెన్ చేశామోనని చాలామంది విద్యార్థులు నిరాశకు గురవుతున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వెబ్ సైట్‌ను పొరపాటున ఓపెన్ చేశామేమోనన్న అనుమానం విద్యార్థుల్లో కలుగుతోంది. 
 
గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి వెబ్ సైట్లను చూడలేదని, యూనివర్సిటీ వెబ్ సైట్‌లో రాజకీయ రంగు పులమడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు విద్యార్థి సంఘం నేతలు. మరోవైపు స్వప్రయోజనాల కోసం యూనివర్సిటీ లాంటి ఉన్నత  విద్యా సంస్థను వాడుకుంటున్నారంటూ వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్వీయు వెబ్ సైట్‌లో చంద్రబాబు ఫోటోను వెంటనే తొలగించాలని, ఆ ప్రాంతంలో తిరుమల వేంకటేశ్వరస్వామి చిత్రాన్ని ఉంచాలంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments