Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది...

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (15:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆకస్మిక ఢిల్లీ పర్యటన గురువారం ముగిసింది. బుధవారం సాయంత్రానికి హస్తినకు చేరుకున్న ఆయన.. అదే రోజు అర్థరాత్రి సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. గురువారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. 
 
వీరిద్దరి మధ్య దాదాపు 40 నిమిషాలపాటు సమావేశం జరిగింది. ఇందులో ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చ జరిగినట్టు సమాచారం. ముఖ్యంగా, గత ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఉపాధి హామీ, పోలవరం నిధుల విడుదలపై కూడా ఈ సమావేశంలో చర్చినట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటు కర్నాటక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ సమయంలో సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సీఎం ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు తగ్గించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments