Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అపుడు బూతులు తిట్టి.. ఇపుడు నీతులు చెబితే ఎలా? : పేర్ని నానిపై పవన్ కళ్యాణ్ ఫైర్ (Video)

Advertiesment
pawankalyan

ఠాగూర్

, సోమవారం, 30 డిశెంబరు 2024 (19:40 IST)
వైకాపా ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని నాటి మంత్రి పేర్ని నాని చేసిన తప్పులే ఇపుడు ఆయన ఇంట్లో వాళ్లను వీధిలోకి తెచ్చాయని, అపుడు బూతులు తిట్టి.. ఇపుడు నీతులు వల్లిస్తే ఎలా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 
 
తూర్పు గోదావరి జిల్లాలో రేషన్ బియ్యం మాయమైంది నిజం. డబ్బులు కట్టింది వాస్తవం. ఇంట్లో ఆడవాళ్ళ పేరుతో గిడ్డంగి పెట్టిందెవరు అని ప్రశ్నించారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన వారిని మీరు తిట్టలేదా అని నిదీశారు. 
 
గతంలో పేర్ని నాని చేసిన తప్పులే ఆయన ఇంట్లో వాళ్ళను వీధిలోకి తెచ్చాయి. అపుడు బాతులు తిట్టి ఇపుడు నీతులు వల్లిస్తే ఎలా? గత ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తుంది. అడ్డగోలు నిర్ణయాలపై అధికారులు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, పని చేసే సంస్కృతిని చంపేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వ తొలి ఆరు నెలల, ఈ ప్రభుత్వ ఆరు నెలల పాలను బేరీజు వేసుకోండి.. ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుంది అని వ్యాఖ్యానించారు. 
 
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు కోసం పని చేయాలని చెబుతున్నాం. పాలన తీరు, ప్రజా సమస్యల పరిష్కారంపై ఇప్పటివరకు దృష్టిపెట్టాం. ఇపుడు నేరుగా ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. ఎన్డీయే ఆధ్వర్యంలో చాలా బాధ్యతతో పని చేస్తున్నాం. పదవులు అనుభవించడం కాదు.. బాధ్యతతో పని చేస్తాం. ప్రతి గ్రామానికి తాగునీరు ఇవ్వాలనేది ప్రధాని నరేంద్ర మోడీ కల. తాగునీరు, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టిపెట్టాం అని పవన్ చెప్పారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పేర్ని నాని భార్య జయసుధకు ఊరట, ముందస్తు బెయిల్ మంజూరు