మాట నిలబెట్టుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం - డీఏ విడుదల చేసిన సర్కారు

ఠాగూర్
సోమవారం, 20 అక్టోబరు 2025 (14:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు టీడీపీ కూటమి ప్రభుత్వం దీపావళి బహుమతి ఇచ్చింది. ఈ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు తీపి కబురు చెప్పింది. చాలాకాలంగా ఎదురు చూస్తున్న కరవు భత్యంలో ఒక విడతను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధిపొందనున్నారు. 
 
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ జారీ చేసిన ఈ ఆదేశాల ప్రకారం, ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచారు. ఈ పెంపుదల 2024 జనవరి ఒకటో తేదీ నుంచే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు కూడా 3.64 శాతం కరవు సహాయం (డీఆర్) పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపునకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 
 
ఉద్యోగ సంఘాలతో గతంలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన డీఏ బకాయిలలో ఒకదానిని విడుదల చేస్తామని ఆయన అప్పట్లో హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ పండగ సమయంలో ఈ డీఏను మంజూరు చేయడం గమనార్హం. పెంచిన డీఏకు సంబంధించిన బకాయిలను కూడా త్వరలోనే ఉద్యోగులకు చెల్లించే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments