Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజన చేయడం వల్లే జీతాలు ఇవ్వలేకపోతున్నాం..

Webdunia
ఆదివారం, 22 జనవరి 2023 (09:45 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజన చేశారని, అందువల్లే నవ్యాంధ్ర ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వలేక పోతున్నామని ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు. 
 
వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క నేల కూడా సక్రమంగా అంటే ఒకటో తేదీన వేతనాలు చెల్లించలేదు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. ఇదే అంశంపై పలు ఉద్యోగ సంఘాల నేతలు ఏకంగా గవర్నర్‌ను కలిసి తమ బాధను కూడా వినిపించుకున్నాయి.
 
అంతేకాకుండా, ఉద్యోగులు, పెన్షన్‌దారులకు జీతాలు సకాలంలో ఇవ్వాలని, ఈ మేరకు చట్టం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ ఉద్యోగ సంఘం గవర్నర్ హరిచందన్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. 
 
ఈ అంశాలపై రావత్ స్పందిస్తూ, రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం, కరోనా పరిస్థితుల కారణంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. అయినప్పటికీ ప్రతి నెల ఐదో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని, గతంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగిందని చెప్పారు. 
 
ప్రతి నెల 5వ తేదీ నాటికి 95 నుంచి 90 శాతం మంది వేతనాలు, పింఛన్లు చెల్లిస్తున్నామన్నారు. మిగిలిన 5 శాతం మందికి ఖచానాలో బిల్లులు సమర్పించిన తేదీకి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నట్టు చెప్పారు. ఖజానా అధికారులు నెలాఖరులోగా ఉద్యోగుల జీతాలు బిల్లులు చెల్లించగలిగితే కనుక ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించగలుగుతామని చెప్పారు. 
 
రిజర్వు బ్యాంకు, బ్యాంకు సెలవులు, రాష్ట్రంలో నిధులు, అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా చెల్లింపులు జరుపుతున్నట్టు చెప్పారు. గతంలోనూ ఇపుడు ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆయన చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments