Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రూప్ -1 ఉద్యోగాల నియామకం: ఇంటర్వ్యూలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Webdunia
గురువారం, 16 జూన్ 2022 (12:35 IST)
గ్రూప్ -1 ఉద్యోగాల నియామకంలో ఇంటర్వ్యూలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని కూడా ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. 
 
అభ్యర్ధుల జవాబు పత్రాలు, మార్కుల వివరాలను సీల్డ్ కవర్లో ఉంచాలని కూడా హైకోర్టు ఏపీపీఎస్సీని ఆదేశించింది. తుది ఆదేశాల మేరకు మాత్రమే తుది ఎంపిక ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది.  ఈ విషయాన్ని ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్ధులకు సమాచారం ఇవ్వాలని కూడా కోర్టు సూచించింది.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్యున్నత సర్వీసులైన గ్రూప్‌–1, 2 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఈ ఏడాది మార్చిలో అనుమతించింది.ఈమేరకు ఆర్థిక  శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్ మార్చి 31వ తేదీ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
గ్రూప్‌–1లో 110, గ్రూప్‌–2లో 182 పోస్టులు భర్తీ చేస్తారు. గతంలో ప్రకటించిన జాబ్‌ క్యాలండర్‌ కంటే అధికంగా పోస్టులు భర్తీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు.
 
దీంతో గ్రూప్‌ 1,2 విభాగాల్లో 292 ఉద్యోగాలను ప్రకటించారు. గ్రూప్‌–1లో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ, ఆర్టీవో, సీటీవో, మున్సిపల్‌ కమిషనర్లు, డీఎఫ్‌వో, ఎంపీడీవో వంటి పోస్టులు ఉండగా, గ్రూప్‌–2లో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్‌లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి.
 
గ్రూప్ 2 కు సంబంధించి మొత్తం 182 ఖాళీలున్నాయి. అయితే గతేడాది విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్1, గ్రూప్ 2 మొత్తం ఖాళీలు కేవలం 36 మాత్రమే ఉన్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments