Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి భూములను వైకాపా నేతలు కబ్జా చేశారు : మంత్రి ఆనం రామనారాయణ

ఠాగూర్
ఆదివారం, 11 ఆగస్టు 2024 (10:59 IST)
తిరుపతి భూములను వైకాపా నేతలు కబ్జా చేశారని ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బ్లాక్‌-2లోని తన ఛాంబర్‌లో పూజలు చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలిచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం దేవాదాయ శాఖకు సంబంధించిన పలు దస్త్రాలను ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. 
 
గత ప్రభుత్వంలో తిరుమల నుంచి అరసవల్లి వరకు భూములు అన్యాక్రాంతం అయ్యాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజాగళం, యువగళంలో వచ్చిన వినతులను పరిష్కరిస్తామని తెలిపారు. 
 
ఎన్నికల హామీల మేరకు రూ.50 వేలకు తక్కువ ఆదాయం ఉన్న దేవస్థానాలకు ధూపదీప నైవేద్యాలకు రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనికి సంబంధించి దేవాదాయ శాఖపై రూ.32 కోట్లు అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. 
 
తప్పులు చేసిన వారిని వదిలేది లేదని మంత్రి హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలో రెండు ఆలయాల్లో తప్పులు జరిగినట్లు నిర్ధరించి ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశామన్నారు. వారిపై పూర్తి విచారణ జరుగుతోందని వివరించారు. కొన్ని దేవాలయాలను పునర్నిర్మించడానికి నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశంతో కృష్ణ, గోదావరి సంగమం వద్ద జలహారతి తిరిగి కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments