Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీకేనా బాధలు.. మాకు లేవా? పార్టీలో ఉంటే ఉండు పోతే.. నేతలపై మంత్రి బొత్స ఫైర్

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (11:51 IST)
సొంత పార్టీ నేతలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణం ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకేనా బాధలు.. మాకు లేవా ఏంటి... ఉండే ఉండు పోతే పో అంటూ మండిపడ్డారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో సొంత పార్టీకి చెందిన నేతలపై ఆయన మండిపడిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
శనివారం ఇక్కడ జరిగిన ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి బొత్స హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిశాక తిరిగి వెళ్లేందుకు కారు ఎక్కిన ఆయన వద్దకు ఎస్‌.కోట పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్‌ రహమాన్‌ వెళ్లారు. 'స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసి ఓడించిన వారికి పదవులు ఇచ్చారు. ఇప్పుడు వారు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు చేస్తున్న వారిని అందలం ఎక్కిస్తే మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న మాలాంటి వారి పరిస్థితి ఏమిటి? అటువంటి వారి వల్ల నియోజకవర్గంలో చాలా బాధలు పడుతున్నాం'  అంటూ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై మంత్రికి ఫిర్యాదు చేశారు. 
 
ఆ సమయంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పక్కనే ఉన్నారు. ఇలాంటివి మాట్లాడడానికి సమయం కాదని.. ఏమైనా ఉంటే విజయనగరం వచ్చి మాట్లాడాలంటూ మంత్రి బదులిచ్చారు. రహమాన్‌ ఇంకా ఏదో చెప్పబోతుండగా మంత్రి ఒక్కసారిగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'పార్టీలో ఉంటే ఉండు లేకపోతే బయటకు పో.. ఏం మాట్లాడుతున్నావు. బాధలా, ఏంటి నీ బాధలు, నీకేనా మాకు లేవా బాధలు. ఇక్కడ బాగా క్రమశిక్షణరాహిత్యం పెరిగిపోయింది. నువ్వే పోటుగాడివా, వీరందరికీ చేతగాదనుకున్నావా రాజకీయం చేయడం?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనను వీడియో తీస్తున్న వారిపై కూడా మంత్రి మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments