Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకున్నా, తమ పార్టీ ఎమ్మెల్యేలే విపక్షంగా...

వర్షాకాల సమావేశాలను అర్థవంతంగా నిర్వహిస్తామని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. వర్షాకా సమావేశాలు ఈ నెల 19వ తేదీ వరకూ 7 రోజుల పనిదినాల పాటు జరుగనున్నాయని, ఈ మేరకు శాసన సభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన గురువారం

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (21:36 IST)
వర్షాకాల సమావేశాలను అర్థవంతంగా నిర్వహిస్తామని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. వర్షాకా సమావేశాలు ఈ నెల 19వ తేదీ వరకూ 7 రోజుల పనిదినాల పాటు జరుగనున్నాయని, ఈ మేరకు శాసన సభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన గురువారం ఉదయం జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అసెంబ్లీ అవరణలో ఉన్న మీడియా పాయింట్‌ వద్ద విలేకరులకు గురువారం ఆయన తెలిపారు. 
 
శాసనసభ స్పీకర్‌ కోడెల అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగిందన్నారు. గురువారం నుంచి ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు ఈ నెల 19వ తేదీ వరకూ జరగనున్నాయన్నారు. ఈ సమావేశాలు 7 రోజుల పని దినాలలో జరిగేలా బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మొదటి రోజయిన గురువారం మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతికి సంతాపం తెపడంతో పాటు ప్రశ్నోత్తరాల సమయం నిర్వహించామన్నారు. శుక్రవారం నాడు రాష్ట్రంలోని కరవు, భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాలపైనా చర్చించనున్నామన్నారు. 
 
7 రోజుల పాటు సాగే వర్షాకాల సమావేశాలను అర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. ప్రతిపక్ష సభ్యులు లేకున్నా, అధికార పార్టీ ఎమ్మెల్యేలే విపక్షంగా వ్యవహరిస్తూ, సమస్యలపై మంత్రులను నిదీస్తారని చెప్పారు. టీడీఎల్పీ 17 అంశాలను, బీజేఎల్పీ 14 అంశాలపైనా చర్చించాలని బీఏసీలో ప్రతిపాదించాయన్నారు. వాటితో పాటు మరికొన్ని అంశాలను చర్చిస్తామని మంత్రి కాలవ శ్రీనివాసులు వెల్లడించారు.
 
7 రోజుల పని దినా వివరాలు : 
ఈ నెల ఆరు, ఏడు తేదీలు (గురువారం, శుక్రవారం) పని దినాలు
8, 9 తేదీలు (శని, ఆదివారాలు) సెలవు దినాలు.
10, 11 తేదీలు (సోమ, మంగళ వారాలు) పని దినాలు.
12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు (బుధవారం నుంచి ఆదివారం వరకు) సెలవు దినాలు.
17, 18, 19 తేదీలు (సోమ, మంగళ, బుధవారాలు) పని దినాలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments