Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలో లోపాలు ఉన్నాయ్.. మనస్తత్వ విశ్లేషకుడి వద్దకు వెళ్తా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్. ఈయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా. ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకైక తనయుడు. కొంతకాలం పార్టీ శ్రేణుల

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (08:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్. ఈయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా. ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకైక తనయుడు. కొంతకాలం పార్టీ శ్రేణులతో కలిసి పనిచేశాక.. క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ టిక్కెట్ ద్వారా శాసనమండలిలోకి అడుగుపెట్టి రాష్ట్రమంత్రి అయ్యారు.
 
అయితే, నారా లోకేష్‌కు ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేదనే విమర్శలు జోరుగా వచ్చాయి. దీనికి పలు సందర్భాల్లో ఆయన మాటతీరుకు కూడా తోడైంది. దీంతో విపక్షాలు లోకే‌ష్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించాయి. పిమ్మట తండ్రి సూచన మేరకు గత కొంతకాలంగా నారా లోకేష్ మంత్రిగా ఉన్నప్పటికీ పెద్దగా హంగూఆర్భాటాలు ఎక్కడా కనిపించడం లేదు. 
 
ఈనేపథ్యంలో తాజాగా అమరావతి కేంద్రంగా టీడీపీ వర్క్‌షాప్ జరిగింది. ఇందులోభాగంగా, వ్యక్తిత్వ విశ్లేషణ పరీక్షను కూడా నిర్వహించింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయని, అలాగే, తనలోనూ కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పారు. ఆ లోపాలను సవరించుకోగలిగినంత వరకు సవరించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఈ పరీక్షలో పాల్గొని విశ్లేషణ తీసుకున్నానని అన్నారు. ఈ పరీక్ష ద్వారా తనలోని కొన్ని లోపాలు తెలిశాయని, వాటిని సవరించుకునేందుకు మనస్తత్వ విశ్లేషకుడి వద్దకు శిక్షణకు వెళ్తున్నానని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments