Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోంవర్క్ చేయలేదనీ.. క్లాస్‌లో బట్టలు విప్పించిన టీచర్...

ఇటీవలికాలంలో హోంవర్క్ చేయని చిన్నారుల పట్ల ఉపాధ్యాయులు నడుచుకుంటున్నతీరు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొంతమంది టీచర్లు అయితే మరీ పైశాచికత్వంగా ప్రవర్తిస్తున్నారు.

Webdunia
గురువారం, 27 జులై 2017 (14:29 IST)
ఇటీవలికాలంలో హోంవర్క్ చేయని చిన్నారుల పట్ల ఉపాధ్యాయులు నడుచుకుంటున్నతీరు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొంతమంది టీచర్లు అయితే మరీ పైశాచికత్వంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా హోంవర్క్ చేయని కారణంగా ఓ విద్యార్థినితో తరగతి గదిలో బట్టలు విప్పించారు. ఈ ఘటన హైదరాబాద్, ఏఎస్ రావు నగర్‌లో జరిగింది. 
 
ఏఎస్.రావు నగర్‌లో ఉన్న గౌతం మోడల్ స్కూల్‌లో దారుణం జరిగింది. విద్యార్థి హోంవర్క్ చేయలేదని ఇంగ్లీష్ టీచర్ గట్టిగా మందలించడమేకాకుండా విద్యార్థినితో బట్టలిప్పించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్‌‌కు వచ్చి టీచర్, యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. సంబంధిత టీచర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. హోమ్ వర్క్ చేయనంత మాత్రాన ఈ విధంగా చేస్తారా? అంటూ మండిపడ్డారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments