Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ హయాంలో మేధావులపై దాడులు.. అయిలయ్యకు భద్రత ఇవ్వండి

దళితులు, అంబేద్కర్ వాదుల కోసం కంచ అయిలయ్య ఎంతో కృషి చేశారని ఆయనకు ప్రతిష్టమైన భద్రత కల్పించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు ప్రాణహ

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (11:35 IST)
దళితులు, అంబేద్కర్ వాదుల కోసం కంచ అయిలయ్య ఎంతో కృషి చేశారని ఆయనకు ప్రతిష్టమైన భద్రత కల్పించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మేథావులందరిపైనా దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. 
 
ఐలయ్యపే బెదిరిస్తున్న వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ఆర్య వైశ్యుల‌పై కంచ ఐల‌య్య రాసిన పుస్తకం వివాదాస్పదం కావడం… ఆయ‌న‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో ఓయూ పీఎస్‌లో ఆయన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
 
మరోవైపు కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య తరువాత కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది. గౌరీ లంకేష్ హత్యలాగా మరో హత్య జరగకుండా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, బహుబాష నటుడు, సాహితీవేత్త గిరీష్ కర్నాడ్ తో పాటు ప్రముఖులకు భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఇదే తరహాలో కంచ అయిలయ్యకు కూడా తెలంగాణ రాష్ట్రం భద్రత ఇవ్వాలని.. అలాగే మిగిలిన మేధావులకూ సర్కారు భద్రత ఏర్పాటు చేయాలని ఓవైసీ అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments