Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త వెన్నెముకకు శస్త్రచికిత్స.. ఆస్పత్రికి ఆటోలో వెళ్ళిన భార్య.. డ్రైవర్ అత్యాచారం

భర్తకు వెన్నెముక దెబ్బతింది. ఇక భార్య ఉద్యోగం చేస్తూ.. ఆస్పత్రిలో భర్త బాగోగులు చూసింది. ఓ రోజు ఆటోలో ఆస్పత్రికి వెళ్దామని ఎక్కింది. ఆ డ్రైవర్ ఆమె వద్ద నీతిమంతుడిలా కనిపించాడు. ఆస్పత్రికి వెళ్లిన ఆటోల

Webdunia
బుధవారం, 24 మే 2017 (09:45 IST)
భర్తకు వెన్నెముక దెబ్బతింది. ఇక భార్య ఉద్యోగం చేస్తూ.. ఆస్పత్రిలో భర్త బాగోగులు చూసింది. ఓ రోజు ఆటోలో ఆస్పత్రికి వెళ్దామని ఎక్కింది. ఆ డ్రైవర్ ఆమె వద్ద నీతిమంతుడిలా కనిపించాడు. ఆస్పత్రికి వెళ్లిన ఆటోలోనే తిరిగి ఇంటికి బయల్దేరిన ఆ మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. ఈ నెల 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. కొత్తపేట కోమల విలాస్ సెంటర్‌ కొండ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు అట్టపెట్టెల తయారీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం భర్త ఓ ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో ప్రభుత్వాసుపత్రిలో అతనిని భార్య చేర్పించింది. అతడికి వెన్నెముక దెబ్బతిందని వైద్యులు నిర్ధారించి, శస్త్ర చికిత్స చేశారు. ఈ క్రమంలో భార్య పని ముగిశాక భర్త వద్దకు వెళ్లి వచ్చేది. 
 
ఈ నెల 14న ప్రభుత్వాసుపత్రికి వెళ్లడానికి కొత్తపేటలో సిటీ బస్సు ఎక్కి చల్లపల్లి బంగ్లా వద్ద దిగింది. అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లేందుకు ఆటో కోసం ఎదురు చూస్తుండగా ఒక ఆటో వచ్చి ఆగింది. డ్రైవర్‌ వివరాలు అడిగి ఆటో ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తిరిగి ఇంటికి తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు. ఆమెతోపాటే భర్త వద్దకు వెళ్లాడు. క్షేమంగా ఇంటి వద్ద దింపుతానని చెప్పాడు. కానీ.. ఇంటికి తిరిగి తీసుకెళ్తూ.. దారి మళ్లించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments