Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాల బై పోల్ ఫైట్ : ఓట్లేసేందుకు బారులు తీరుతున్న ప్రజలు

నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్‌ బుధవారం ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ పోలింగ్‌లో మొత్తం 2,19,108 మంది ఓటర

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (08:49 IST)
నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్‌ బుధవారం ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ పోలింగ్‌లో మొత్తం 2,19,108 మంది ఓటర్లు పాల్గొననున్నారు. వీరందరి కోసం మొత్తం 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 141 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా ప్రకటించారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 800 మంది నుంచి 1000 మంది ఓటేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. 
 
మొత్తం 3500 మంది పోలీసులు ఎన్నికల రక్షణ బాధ్యతలు తీసుకోగా, అందులో పది కంపెనీలకు చెందిన 2,500 మంది కేంద్ర సిబ్బంది ఉండటం విశేషం. అలాగే, పోలింగ్ కేంద్రాల వద్ద 40 మంది డీఎస్పీలు, 150 మంది సీఐలు నియోజకవర్గ వ్యాప్తంగా భద్రత కల్పిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భద్రతా సిబ్బందికి బాడీ ఓర్న్ కెమెరాలు, ఈవీఎంలకు వీసాశాట్ సౌకర్యాన్ని ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఎన్నికలు సాఫీగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. 
 
కాగా, ఈ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంజీవ్‌నగర్‌ బూత్‌ నంబర్‌ 81కి కుటుంబ సమేతంగా వచ్చిన శిల్పా.. ఓటు వేశారు. కాగా, ఉప ఎన్నికలో అధికార పార్టీ తెలుగుదేశం, ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సీపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్న విషయం తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments