Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేటుగా వచ్చినందుకు ప్రియుడిని తిట్టింది.. ఆపై డ్రైయిన్‌లోకి దూకేసింది..

వారు ప్రేమికులు. ఓ చోట కలుసుకున్నారు. అయితే ఇంతలోనే చెప్పిన సమయానికంటే లేటుగా వచ్చినందుకు ప్రేయసి చిరాకు పడింది. అంతటితో ఆగకుండా డ్రెయిన్‌లో దూకింది. ఈ ఘటన భీమవరంలో పట్టణంలో సంచలనం రేపింది. వివరాల్లోక

Webdunia
ఆదివారం, 1 జనవరి 2017 (17:04 IST)
వారు ప్రేమికులు. ఓ చోట కలుసుకున్నారు. అయితే ఇంతలోనే చెప్పిన సమయానికంటే లేటుగా వచ్చినందుకు ప్రేయసి చిరాకు పడింది. అంతటితో ఆగకుండా డ్రెయిన్‌లో దూకింది. ఈ ఘటన భీమవరంలో పట్టణంలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే... సుంకర పద్దయ్య వీధికి చెందిన పుట్ట సత్యస్వరూప(18) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె ఇంటి సమీపానికి చెందిన కనిమిరెడ్డి మహేష్(పండు)(25), ఆమె కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో సత్య స్వరూప శనివారం సాయంత్రం మహేష్‌ను బయటకు వెళ్లడానికి రమ్మని కోరింది. అతను అరగంట ఆలస్యంగా కళాశాల వద్దకు రావడంతో ఆమె అతనిపై చిరాకుపడిందని, బివిరాజు విగ్రహం సమీపంలోని బైపాస్‌ రోడ్‌ బ్రిడ్జి వద్దకు వచ్చి ఒక్కసారిగా యనమదుర్రు డ్రెయిన్‌లోకి దూకేసింది. ఆమెను కాపాడేందుకు మహేష్ కూడా డ్రెయిన్‌లోకి దూకినట్లు చెప్తున్నారు. 
 
వారు కొంతసేపు నీటిలో తేలుతూ ఉన్నారని, ఎవరూ వారిని కాపాడే ప్రయత్నం చెయ్యలేదని తెలుస్తోంది. కొంతసేపటికి వారిద్దరు మునిగిపోయారు. సమాచారం అందుకున్న పైర్‌, టూటౌన్‌ పోలీసులు అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఇరువురి కుటుంబసభ్యులు డ్రైయిన్‌ వద్దకు చేరుకుని విలపించారు. శనివారం రాత్రికి కూడా వారి ఆచూకి లభ్యంకాలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments