Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించాడు... కోర్కె తీర్చుకున్నాడు.. పెళ్లి చేసుకోమంటే ఫ్రెండ్స్‌తో కలిసి గ్యాంగ్ రేప్

ప్రేమ పేరుతో ఓ బాలికను తన వలలో వేసుకున్న ఓ కామాంధుడు... తన కోర్కెను తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఆ బాలిక పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని ఆ నయవంచకుడు.. తన స్నేహితులతో కలిసి సామూహి

Webdunia
గురువారం, 6 జులై 2017 (09:47 IST)
ప్రేమ పేరుతో ఓ బాలికను తన వలలో వేసుకున్న ఓ కామాంధుడు... తన కోర్కెను తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఆ బాలిక పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని ఆ నయవంచకుడు.. తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా చేస్తూ వీడియో తీసి బెదిరించసాగాడు. చివరకు ఆ బాలిక తాను మోసపోయిన విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంకు చెందిన ఓ బాలిక స్థానికంగా ఉండే ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఇదే ప్రాంతానికి చెందిన ఓ అఖిల్ అనే యువకుడి ప్రేమలో పడింది. ఈ క్రమంలో ఆ బాలికతో తన కోర్కె తీర్చుకున్నాడు. ఆ తర్వాత తనను పెళ్ళి చేసుకోవాలని ప్రియుడు అఖిల్‌‌పై ఒత్తిడి తెచ్చింది. పరిస్థితి చేయిదాటకముందే ఆ బాలికను వదిలించుకోవాలని ఎత్తుగడ వేశాడు. 
 
ఇందులోభాగంగా, ఈనెల 1న సదరు బాలికపై తన స్నేహితులతో కలిసి అఖిల్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడ. పనిలోపనిగా సెల్‌ఫోన్‌లో వీడియోలు కూడా తీశాడు. ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని మళ్లీ తమ కోర్కెలు తీర్చాలని, లేదంటే వీడియోలను ఇంటర్‌ నెట్‌లో పెడతామని పదేపదే బెదిరిస్తూ వచ్చాడు. 
 
దాంతో సదరు బాలిక విషయాన్ని తన తల్లికి విషయం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పరారైన అఖిల్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం తిరుపతికి వెళ్లి అఖిల్‌ అరెస్టు చేసి.. అతని నుంచి సామూహిక అత్యాచారం వీడియోలను, ఫొటోలను స్వాధీనం చేసుకున్నారు. అఖిల్ స్నేహితులను కూడా అదుపులోకి తీసుకుని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం