బెదిరించి, భయపెట్టి, దౌర్జన్యాలు చేయకుండా వైసిపి ఏ ఎన్నికల్లోనైనా గెలవగలదా? సోము వీర్రాజు

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (22:41 IST)
వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బిజెపి ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు. అధికార దర్పంతో జగన్ విర్రవీగుతున్నాడంటూ ధ్వజమెత్తారు. తిరుపతి ఉపఎన్నికకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని తిరుపతిలో బిజెపి నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సోము వీర్రాజు హాజరయ్యారు. 
 
వైసిపి బెదిరింపులకు భయపడేది లేదని.. వైసిపి ఆగడాలను ధైర్యంగా తిప్పికొడతామన్నారు. రానున్న ప్రధాన ఎన్నికల్లో వైసిపికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ప్రలోభాలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడకుండా వైసిపి ఏ ఎన్నికల్లోనైనా గెలిచిందా అంటూ ప్రశ్నించారు. 
 
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసిపి గెలుపు ఒక గెలుపేనా అంటూ మండిపడ్డారు. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా బిజెపి అభ్యర్థులు పోటీ చేశారని.. ప్రభుత్వ అధికారులు వైసిపి కోసం పనిచేస్తున్నారన్నారు. మోడీ ఆలోచనా విధానమే ఆయుధంగా తిరుపతి ఉప ఎన్నికల్లోకి వెళతామన్న సోము వీర్రాజు.. జనసేనతో కలిసే ప్రజల్లో ప్రచారం నిర్వహిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments