Webdunia - Bharat's app for daily news and videos

Install App

కచ్చితంగా అధికారంలోకి వస్తాను.. 20 రెట్లు హింసిస్తాను.. బాబు

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (18:11 IST)
కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పర్యటించారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. కుప్పంతో పాటు రామకుప్పం మండలాల్లోని 8 గ్రామాల్లో పర్యటించారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో ఆయన పర్యటించడం ఇప్పుడే. 
 
ఈ సందర్బంగా బాబు మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు మా పార్టీ కార్యకర్తలను చాలారకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. రెండేళ్లలో కచ్చితంగా అధికారంలోకి వస్తాను. ఒకటీ రెండు కాదు.. 20 సార్లు రెట్టింపుగా హింసిస్తాను అంటూ శపథం చేశారు.
 
2014లో జగన్‌ కూడా ఓడిపోయారు. కానీ నేనలా మాట్లాడలేదు. జగన్‌ పుట్టకముందే ప్రభుత్వాలు పేదవారి కోసం పక్కా గృహాలను కట్టించి ఇచ్చాయ ని.. ఇప్పుడు ఎవడబ్బ సొమ్మని ఆయన వారి నుంచి రూ. పదేసి వేలు వసూలు చేస్తున్నాడని చంద్రబాబు నిలదీశారు. రెండేళ్లలో మళ్లీ అధికారంలోకి వస్తానని.. వచ్చిన నెలలోనే ఓటీఎస్‌ డబ్బులు కట్టకుండా మాఫీ చేస్తానన్నారు.
 
నేను నమ్ముకున్న స్థానిక నాయకులు సరిగా పనిచేయకపోవడంతో కుప్పంలో ఓడిపోవాల్సి వచ్చింది. కుప్పం ఫలితాలు నన్ను బాధించాయి. ఇక నుంచి 3 నెలలకోసారి కుప్పం వచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటాను. కుప్పాన్ని సరిచేస్తా. కుప్పంలోనే పోటీ చేస్తా. ఇక్కడే గెలుస్తా. పార్టీలో కోవర్టులుంటే గుర్తించి బయటకు పంపిస్తా. బాగా పనిచేసే వారికి ప్రమోషన్‌ ఇస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments