Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేకమైన పరిస్థితుల్లో దీక్ష చేస్తున్నాం : చంద్రబాబు

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (20:22 IST)
ఎన్టీఆర్ భవన్ లో 36గంటల నిరసన దీక్ష చేస్తున్నామని... ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ దీక్ష చేస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో దాడి జరిగింది కాబట్టే ఇక్కడే దీక్షకు కూర్చున్నామని తెలిపారు.

70లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న దేవాలయం ఇది అని అన్నారు. ఒక పద్ధతి ప్రకారం పక్కా ప్రణాళికతో పార్టీని తుదముట్టించాలనే కుట్రతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయాల్ని యత్నించారని ఆయన అన్నారు. చిన్న పిల్ల మనోభావాలు లెక్క చేయకుండా పట్టాభి ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు.

పార్టీ కార్యాలయంపై దాడి జరగబోతోందని మంగళవారం సాయంత్రం 05:03కి డీజీపీకి ఫోన్ చేస్తే సందించలేదని తెలిపారు. ఇతర పోలీసు ఉన్నతాధికారులకు యత్నించినా స్పందన లేదన్నారు. దీంతో వెంటనే గవర్నర్‌కు ఫోన్ చేస్తే ఆయన స్పందించారని తెలిపారు. రాష్ట్రం మొత్తం ఏకకాలంలో టీడీపీ కార్యాలయాలు, నేతలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని చెప్పామన్నారు.

పోలీసులు, ప్రభుత్వం కలిసి చేస్తున్న దాడిపై తక్షణమే స్పందించాలని అమీత్‌షాను కోరామని అన్నారు. ఇది ప్రజలపై, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని తెలిపారు. తనకేమైనా పర్లేదనే వెంటనే పార్టీ కార్యాలయానికి వచ్చానని చంద్రబాబు చెప్పారు.
 
అందుకే రాష్ట్రపతి పాలన కోరాం 
టీడీపీ పార్టీ ఆఫీస్‌, నాయకులపై దాడిచేసిన వారిని పోలీసులు దగ్గర ఉండి సాగనంపటం సిగ్గుచేటని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి నిరసన చేపట్టిన దీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాష్ట్రపతి పాలన కోరలేదన్నారు.

కానీ ఇవాళ ప్రజల దేవాలయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు, పార్టీ కార్యాలయాలపై వరుస దాడులు జరుగుతున్నందుకే రాష్ట్రపతి పాలన కోరామని వివరించారు. పార్టీ ఆఫీసులోకి చొరబడిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే ఎదురు కేసులు పెట్టించటం సిగ్గుచేటని మండిపడ్డారు. దాడి చేసిన వారితో ఎదురు కేసులు పెట్టించిన డీజీపీకి హ్యాట్సాఫ్ చెప్పాలా అని అన్నారు.

చేతకాకుంటే పోలీసు వ్యవస్థను మూసేయండని హితవుపలికారు. ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నేతలు వాడిన భాషపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసేందుకే ముందుకు పోతున్నారన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments