Webdunia - Bharat's app for daily news and videos

Install App

జె.సి. బ్రదర్స్‌ను చూసి చంద్రబాబు వణుకుతున్నారా?

జె.సి. బ్రదర్స్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. వీరి గురించి చెప్పిన వెంటనే అనంతపురం జిల్లా గుర్తుకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల పాటు రాజకీయం చేసిన ఈ అన్నదమ్ములు ఎపి విభజన తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతపురం

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (13:43 IST)
జె.సి. బ్రదర్స్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. వీరి గురించి చెప్పిన వెంటనే అనంతపురం జిల్లా గుర్తుకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల పాటు రాజకీయం చేసిన ఈ అన్నదమ్ములు ఎపి విభజన తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతపురంలో ఎంపిగా అన్న జె.సి.దివాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యేగా జె.సి. ప్రభాకర్ రెడ్డిలు కొనసాగుతున్నారు. అసలు వీరు తెలుగుదేశం పార్టీలో చేరకుండా ఉంటే రాజకీయాలు వేరేగా ఉండేవి. ఫలితాలు తారుమారు అయ్యేవి. 
 
గత నెలరోజుల క్రితం జె.సి.దివాకర్ రెడ్డి ప్రభుత్వంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపిగా ఉండి తాను చేసేది ఏమీ లేదంటూ తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఇబ్బంది తప్పదని భావించిన చంద్రబాబు వెంటనే జె.సి.దివాకర్ రెడ్డి చెప్పిన సమస్యలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఆ తరువాత ఆయన వెనక్కి తగ్గారు. ఇప్పుడు తమ్ముడు జె.సి.ప్రభాకర్ రెడ్డి మరో డిమాండ్‌ను బాబు ముందుంచాడు. 
 
తాడిపత్రి నియోజకవర్గంలో గ్రానైట్ కార్విల్ ఎక్కువగా ఉన్నాయని వాటికి రాయల్టి తగ్గించాలని ఎప్పటి నుంచో ప్రభాకర్ రెడ్డి పట్టుబడుతున్నాడు. అయితే మంత్రులెవరూ దాన్ని పట్టించుకోకపోవడంతో వారిపైన ఫైరయ్యారు. దీంతో చంద్రబాబు గ్రానైట్ కార్విల్ రాయల్టిలో 20 శాతం తగ్గింపుకు ఆమోద ముద్ర వేశారు. జె.సి. బ్రదర్స్ ఏది చెబితే అది చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. అందే కాదు జె.సి. బ్రదర్స్‌ను చూసి బాబు వణికిపోతున్నారంటూ ఆ పార్టీలోని కొంతమంది నేతలు అనుకోవడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments