Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రి సెంట్రల్ జైలులోని స్నేహా బ్లాక్‌లో చంద్రబాబుకు ప్రత్యేక గది

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (13:54 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును రాజమండ్రి సెంట్రల్ జైలులో తరలించారు. అక్కడ చంద్రబాబుకు ప్రత్యేక గదిని స్నేహా బ్లాక్‌లో కేటాయించారు. ఆ గది వద్ద ఐదుగురు సిబ్బందితో ఆయనకు భద్రతకు కల్పించారు. అలాగే, ఆయనకు ఒక సహాయకుడిని కూడా నియమించారు. ఆయనకు ఆహారం, మందులను సహాయకుడు దగ్గరుండి అందిస్తాడు. చంద్రబాబు మంచి చెడ్డలను సహాయకుడు చూసుకుంటాడు. మరోవైపు, కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు ఇంటి ఆహారాన్ని అందించనున్నారు. టీడీపీ అధినేతకు జైల్లో అన్ని వసతులను కల్పించారు.
 
మరోవైపు, జైలుకు తరలించిన తర్వాత చంద్రబాబు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు నిద్రకు ఉపక్రమించినట్టు సమాచారం. ఉదయం 8 గంటల వరకు ఆయన పడుకున్నారు. ఈరోజు చంద్రబాబును కలిసే వారికి ములాఖత్‌కు అనుమతించే అవకాశం ఉంది. భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్‌ను ములాఖత్‌కు అనుమతించవచ్చు. అల్పాహారం తీసుకున్న తర్వాత ములాఖత్‌కు అనుమతించే అవకాశం ఉంది.
 
ఇదిలావుంటే, రాజమండ్రి సెంట్రల్ జైల్ చుట్టూ 300 మంది పోలీసులు మోహరించారు. నగరంలో సెక్షన్ 30 విధించారు. రాజమండ్రి మొత్తం పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. 36 పికెటింగ్‌లతో పహారా కాస్తున్నారు. మరోవైపు, ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. బంద్ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments