Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీటెక్ ఫస్టియర్ విద్యార్థితో మహిళా టెక్నీషియన్ ప్రేమాయణం

ఠాగూర్
గురువారం, 24 జులై 2025 (13:36 IST)
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఓ ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. 38 యేళ్ళ మహిళా ల్యాబ్ టెక్నీషియన్ 19 యేళ్ల బీటెక్ విద్యార్థితో ప్రేమలోపడింది. ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చేస్తున్న విద్యార్థినితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి బెంగుళూరుకు పారిపోయారు. విద్యార్థి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వారిద్దరినీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 
 
38 యేళ్ల ఓ మహిళ చిత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఇదివరకే వివాహమై భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో అదే కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్న 19 యేళ్ళ విద్యార్థితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాంతో వారిద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ ఎవరికీ కనిపించకుండా పారిపోయారు. 
 
మే 24వ తేదీన ఇంటర్న్‌షిప్ కోసం బెంగుళూరుకు వెళుతున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిన కుమారుడు రోజులు గడుస్తున్నా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో వారు కాలేజీకి వెళ్ళి ఆరా తీయగా, వారికి మహిళా ల్యాబ్ టెక్నీషియన్‌తో ప్రేమ వ్యవహారం ఉన్నట్టు తెలియడంతో వారు షాక్‌కు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... ఆ ప్రేమ జంట చిత్తూరులో ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి వారివారి ఇళ్లకు పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

Komati reddy: సినెటేరియా ఫిలిం ఫెస్టివల్ వెబ్ సైట్ ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Manoj: నన్నే కాదు నా కుటుంబాన్ని నిలబెట్టి ఆయనే : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

తర్వాతి కథనం
Show comments