Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డొస్తుందనీ... కన్నబిడ్డను చంపేసింది

రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డొస్తుందని భావించిన ఓ కసాయి తల్లి తన రెండేళ్ళ బిడ్డను హత్య చేసింది. ఈ హత్యకు ఆమె ప్రియుడు కూడా సహకరించాడు. ఈ దారుణం చిత్తూరు జిల్లాలో జరిగింది.

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2017 (14:05 IST)
రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డొస్తుందని భావించిన ఓ కసాయి తల్లి తన రెండేళ్ళ బిడ్డను హత్య చేసింది. ఈ హత్యకు ఆమె ప్రియుడు కూడా సహకరించాడు. ఈ దారుణం చిత్తూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన శాంత (22) అనే మహిళ ఓ రికార్డింగ్ డ్యాన్సర్. నాలుగేళ్ల క్రితం బోయకొండ శ్రీనివాసులు అనే యువకుడిని పెళ్లాడింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత అతన్ని వదిలేసి, మదనపల్లికి చెందిన డాన్స్ గ్రూపులో చేరి, అదే గ్రూపులో డ్యాన్సులు చేసే శ్రీనివాసులుతో సహజీవనం సాగిస్తోంది.
 
వీరిద్దరూ గ్రామాల్లో పండగలు, పబ్బాలకు జరిగే రికార్డింగ్ డ్యాన్సుల్లో పాల్గొంటూ, తద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 23వ తేదీన పుంజనూరు మండలం గాలిమిట్టకు వెళ్లిన ఇద్దరూ, తమ వెంట జ్వరంతో బాధపడుతున్న రెండేళ్ల కుమార్తె శివానిని కూడా తీసుకెళ్లారు. ఆపై మద్యం తాగి, ఒళ్లు తెలియకుండా డ్యాన్సులు వేస్తున్నారు. 
 
ఆ సమయంలో జ్వరంతో బాధపడుతున్న బిడ్డ ఏడుపు వినిపించింది. అంతే, ఒక్కసారిగా శాంతకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పాపను చంపేయాలని తన ప్రియుడిని కోరింది. వెంటనే శ్రీనివాసులు ఆ చిన్నారి గొంతు పిసికి, ఆటో కమ్మీకి బలంగా కొట్టగా, ఆ పాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత మృతదేహానికి దుప్పటి చుట్టి మురుగు కాలువలో పడేశారు. 
 
ఈ విషయం మరుసటి రోజు వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో శాంతతో పాటు.. ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments