ఏపీ విద్యార్థులారా, ఇది మీ కోసమే.. పెరిగిన సెలవుల కారణంగా తరగతుల సమయాలు పెంపు

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (20:28 IST)
ఉన్నత విద్యామండలి రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలకు ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించింది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా కళాశాలలకు సెలవులను పెంచిన సంగతి విదితమే. అయితే డిగ్రీ, పీజీ చదువుతున్న రెండవ మరియు మూడవ సంవత్సర విద్యార్థులకు ఆగస్ట్‌లో తరగతులు ప్రారంభం కానున్నాయి.
 
కాగా మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రం సెప్టెంబర్ నెలలో తరగతులను నిర్వహిస్తారు. కొవిడ్-19 కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో ఆలస్యం కారణంగా తరగతుల సమయాన్ని రోజుకు ఒక గంట నుంచి రెండు గంటల వరకు పెంచనున్నారు.
 
పండగలకు ఇచ్చే సెలవులకు సైతం కోత పెట్టనున్నారు. ప్రతి శనివారం కూడా సెలవులు లేకుండా తరగతులు నిర్వహించనున్నారు. ఆగస్ట్ నుండి మే వరకు అన్ని కళాశాలలు, యూనివర్సిటీలు పని చేసేలా అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించారు. రానున్న విద్యా సంవత్సరం, అనగా 2020-21 అకడమిక్ ఇయర్‌ను యథావిధిగా ఉండేలా ప్రణాళికలు రచించారు.
 
డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చివరి ఏడాది విద్యార్థులకు జూలైలో పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే మిగతా సంవత్సరాలలోని విద్యార్థులకు కూడా తరగతులు ప్రారంభం అయ్యాక పరీక్షలు నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. ఆగస్ట్‌లో ఇంజనీరింగ్ సీట్ల కోసం కౌన్సిలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. వీటిని పూర్తి చేసిన తర్వాత డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలను నిర్వహిస్తారని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tripti Dimri: బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రి నాయికగా బిజీ అయిపోయింది

Nithya Menen: కథలు చెప్పడంకంటే సినిమా తీయడం ఇష్టం : నిత్యా మీనన్

Rashmika: రష్మికమందన్న వివాహంపై ప్రమోద్ శెట్టి వ్యాఖ్యల వివాదం !

Karate Kalyani: యూట్యూబర్ అన్వేశ్‌పై ఫైర్ అయిన కరాటే కల్యాణి

Satyadev: కన్నడ రూటెడ్‌ చిత్రాలకు తెలుగులో ఆదరణ ఉంటుంది: సత్యదేవ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

తర్వాతి కథనం
Show comments