Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఠాగూర్
ఆదివారం, 6 ఏప్రియల్ 2025 (09:07 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓ గురుకుల పాఠశాలకు వెళ్లి అక్కడి బాత్ రూమ్స్, మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. వారు ఎదుర్కొనే పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 45 యేళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ, 15 యేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి, తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఓ వ్యక్తి ఇలా గురుకుల పాఠశాలకు వెళ్లి మరుగుదొడ్లను తనిఖీ చేయడంపై ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో పాటు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన ప్రతీకారపన్నులపై కూడా ఆయన స్పందించారు. ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం ఏపీపై కూడా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఆక్వా రంగం దెబ్బతినే పరిస్థితి వచ్చిందన్నారు. దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఎప్పటికపుడు సమీక్షించుకుంటామని ఆయన చెప్పారు. 
 
ఇకపోతే, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే, అభివృద్ధి కార్యక్రహమాలు చేయాలని ఆయన సూచించారు. పేదవ సేవలో భాగంగా ఒకటో తేదీనే పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. స్వయం ఉపాధి కింద అనేక పథకాలను తీసుకొచ్చామని వెల్లడించారు. నాయకుడు దూరదృష్టితో ఆలోచన చేస్తే జాతి బాగుంటుందని చెప్పారు. ఏ వ్యక్తి కూడా పేదరికంలో ఉండటానికి వీల్లేదన్నారు. 
 
దీపం పథకం కింద యేడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు. ఎంతమంది పిల్లలుంటే అతంమందికీ తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఇస్తామని చెప్పారు. మొన్నటివరకు రోడ్లు ఎలా ఉన్నాయో.. ఇపుడు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాలని ఆయన కోరారు. తాను ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తుంటే వైకాపా వాళ్లు వాటిని పాడు చేయడమేకాక పంపులు, స్టార్టర్లు ఎత్తుకెళుతున్నారని మండిపడ్డారు. వీళ్ల ఆలోచనలు మారాలని చెప్పారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments