Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ పాలకమండలిని రద్దు.. టీటీడీ ఛైర్మన్‌గా జగన్ మేనమామ?

Webdunia
ఆదివారం, 2 జూన్ 2019 (11:48 IST)
ఏపీలోని జగన్ ప్రభుత్వం టీటీడీ పాలకమండలిని రద్దు చేయడం అనివార్యమైంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. మూడు నాలుగు రోజుల్లో టీటీడీ నిబంధనల్లోని 135 ప్రకారం బోర్డును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. 

దేవాదాయ శాఖ కమిషనర్ సిఫార్సు మేరకు ప్రభుత్వం నిర్ధిష్ట కారణాలపై టీటీడీ బోర్డును రద్దు చేయొచ్చు. ఇందుకు సంబంధించిన ఫైలు కూడా సిద్ధమైందని సమాచారం. 
 
ఏపీలో టీడీపీ ప్రభుత్వం దిగిపోయింది. ఇక వైసీపీ ప్రభుత్వం రావడంతో... టీటీడీ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేస్తారని అంతా అనుకున్నారు. సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా టీటీడీ పాలకమండలి సభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తుంటారు. 
 
కానీ పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం ఇందుకు నిరాకరించారు. అంతేకాదు టీటీడీ చైర్మన్ హోదాలో పాలకమండలి సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

టీటీడీ ఈవో, జేఈవోతో పాటు పలువురు సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ఈ సమావేశం అర్థాంతరంగా ముగిసింది. దీంతో టీటీడీ పాలకమండలిని రద్దు చేసే దిశగా జగన్ సర్కారు రంగం సిద్ధం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
 
అంతేగాకుండా టీటీడీ ఛైర్మన్ పదవికి జగన్మోహన్ రెడ్డి మామయ్య ఎంపికవుతారని టాక్ వస్తోంది. వైఎస్ జగన్ మామగారు, మాజీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారావు టీటీడీ ఛైర్మన్ పదవికి ఎంపిక అవుతారని.. ఈ దిశగా జగన్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. వైవీ సుబ్బారావు.. జగన్ అమ్మగారైన విజయలక్ష్మికి సోదరుడు కావడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నతో మాట్లాడినా లింకులు పెట్టేస్తున్నారు.. రెండో పెళ్లి అంటూ ట్రోల్ చేస్తున్నారు... జాను వీడియో

అనిరుధ్ సంగీతానికి అభిమాని అయిపోయా : విజయ్ దేవరకొండ

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments