30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగించండి: కన్నా డిమాండ్

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (08:06 IST)
ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ ఈ నెల 30 వరకూ కొనసాగించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సిఎం జగన్‌కు లేఖ రాశారు.

కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ సడలించడమే మేలని వ్యాఖ్యానించారు. భారత్‌లో లాక్‌డౌన్‌ విధించి కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను చాలా దేశాలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందించిందని పేర్కొన్నారు.

ఇప్పటికే లాక్‌డౌన్‌ పొడిగించాలని ఒడిసా, తెలంగాణాతో పాటు మరికొన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయని వివరించారు.

లాక్‌డౌన్‌ కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయాలనుకోవడం సరికాదన్నారు. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థికవ్యవస్థ దెబ్బతింటున్నప్పటికీ ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ 10 సీజన్‌లో అడుగుపెట్టాలని వుంది, నన్ను సెలక్ట్ చేయండి: నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో

OG2 : తుఫాను రాకముందు.. ఒక నిశ్శబ్ద క్షణం అంటూ.. ఓజీ 2 అప్ డేట్

Samantha career over : స‌మంత కెరీర్‌ అయిపోయింద‌న్నారు, క‌రెక్టేనేమో అనిపించింది : స‌మంత‌

వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా చిత్రం

పెద్దలను ఎదిరించి ప్రియుడిని పెళ్లాడిని జబర్దస్త్ ఫైమా

తర్వాతి కథనం
Show comments