Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పం రైల్వేస్టేషన్‌లో కరోనా రోగి మృతి బాధాకరం: చంద్రబాబు నాయుడు

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (14:46 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అసమర్థతతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనీ, చిత్తూరు జల్లా కుప్పం రైల్వే స్టేషన్‌లో కరోనా రోగి మృతి బాధాకరం అని చంద్రబాబు అన్నారు. 

ఇంకా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో నెలకొన్న దయనీయ పరిస్థితులకు ఈ ఘటన అద్దం పడుతోంది. గుడిపల్లె మండలం మిద్దూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌కు కరోనా సోకగా ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించడంలో విఫలం కావడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు బెంగుళూరు బయలుదేరాడని, ఇంతలోనే ఊపిరి అందక రైల్వే స్టేషన్‌లో చనిపోయారన్నారు.

మృతుడి సోదరుడిని చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. సకాలంలో ఆక్సిజన్ అందక, బెడ్లు లభించక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటంలేదనీ, ఇప్పటికైనా ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో పరిశీలన చేయాలని అలసత్వం వీడి ప్రతి ఒక్కరికీ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments