Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటిలో కార్తీక దీపాలు వ‌ద‌ల‌బోయి... ప్రాణాలు వ‌దిలిన దంప‌తులు

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (10:18 IST)
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని కాల్వలో దీపాలు వదిలేందుకు వెళ్లిన దంపతులు త‌మ నిండు ప్రాణాల‌ను వ‌దిలారు. కాలువ‌లో దీపాలు వ‌దులుతూ ప్ర‌మాద‌వ‌శాత్తు జారిప‌డి అందులో పడి మృతి చెందారు. కర్నూలులో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. నగరంలోని అబ్బాస్ నగర్‌కు చెందిన రాఘవేంద్రప్రసాద్ (44), ఇందిర (41) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని రాఘవేంద్రప్రసాద్ దంపతులు తెల్లవారుజామున 5 గంటలకు వినాయక్ ఘాట్ వద్ద కేసీ కాల్వ పక్కనే ఉన్న గుడికి వెళ్లారు.
 
 
పూజల అనంతరం కాల్వలో దీపం వదులుతూ, ప్రమాదవశాత్తు ఇందిర అందులో పడిపోయారు. ఆమెను రక్షించే క్రమంలో భర్త రాఘవేంద్రప్రసాద్ కూడా కాల్వలో పడిపోయారు. అప్రమత్తమైన స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే, నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండడంతో వారు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో జహారాపురం వద్ద వారి మృత దేహాలను గుర్తించారు. కార్తీక మాసంలో జ‌రిగిన ఈ దంప‌తుల విషాదాంతం అంద‌రినీ క‌లిచివేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments